20న టాలీవుడ్ భేటీ జగన్‌తో కాదు పేర్ని నానితో !

టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ 20వ తేదీన అపాయింట్‌మెంట్ ఇచ్చారని టాలీవుడ్ టాప్ హీరోలంతా వచ్చి సమావేశం అవుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ రోజున మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని అధికారికంగా ఓ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సినిమాటిక్కెట్ల అంశంపై పరిశ్రమలోని వివిధ వర్గాలు.. వివిధ వ్యాపార విభాగాల పెద్దలతో పేర్ని నాని సమావేశం అవుతారని.. దీనికి ఫిల్మ్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయచందర్ కూడా హాజరవుతారని అంటున్నారు.

జగన్‌తో సినీ పెద్దలు భేటీ అవుతారన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై ఇటీవల మీడియాతో మాట్లాడిన పేర్ని నాని త్వరలో సీఎంతో సినీ పెద్దల భేటీ ఉంటుందని చెప్పారు కానీ ఎప్పుడు ఉంటుందో చెప్పలేదు. అదే సమయంలో టిక్కెట్ల అంశంపై భేటీ ఉంటుందని అన్నారు. ఆ భేటీ పేర్ని నానితో అని ఇప్పుడు క్లారిటీ వస్తోంది. ఇటీవల ప్రభుత్వం టిక్కెట్లను అమ్మాలని నిర్ణయించుకుంది. ఆ అంశంపై అభిప్రాయాలు సేకరించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారన్న దానిపై స్పష్టత లేదు సీఎంతో సమావేశం అంటే చిరంజీవి సహా టాలీవుడ్ పెద్దలుగా భావించేవారు హాజరయ్యే అవకాశం ఉంది. కానీ పేర్ని నానితో భేటీకి ప్రత్యేకంగా విజయవాడ వెళ్లడానికి చిరంజీవి సిద్ధంగా ఉంటారా అన్నది సందేహమే. టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మాలని సినీ పెద్దలే కోరినట్లుగా పేర్ని నాని చెప్పారు. తామే కోరామని కానీ.. కోరలేదని కానీ వారు ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరవయ్యో తేదీన దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close