పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీపెద్దలలు, సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ.. ఐబొమ్మ రవి అరెస్టు సినిమాలో సూపర్ హిట్ సీన్ లాగా ఉంది. విలన్ చాలెంజ్ చేస్తే పోలీస్ గా ఉన్న హీరో తనని లోపల వేస్తాడు. పోలీసులకు ఛాలెంజ్ చేసి భస్మాసురా హస్తంలా తన చేయి తనపై వేసుకున్నాడు. పోలీసులతో పెట్టుకోవద్దు. బి కేర్ ఫుల్ అనే సందేశం మరోసారి చాలా గట్టిగా చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రపంచంలో ఏది కూడా ఫ్రీగా రాదు. దాని వెనకాల కనిపించని కష్టం ఉంటుంది. వెబ్సైట్లు సర్వర్ నడపాలంటే చాలా డబ్బులు కావాలి. అదంతా మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మీ డాటాని క్రిమినల్ యాక్టివిటీస్ కి ఉపయోగించుకుంటున్నారు. ఇది మీ డబ్బులే కాదు కొన్నిసార్లు ప్రాణాలు తీసే వరకు వెళుతుంది. దయచేసి అర్థం చేసుకుని పైరసీని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు.’అని కోరారు.
అలాగే సజ్జనార్ కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. ఐబొమ్మ రవిపై ఐటీ యాక్ట్, కాపీ రైట్ యాక్ట్ కింద మరో 4 కేసులు నమోదు చేశాం. రవి సమాజానికి చాలా నష్టం చేశాడు. పైరసీ ద్వారా నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నాడు. దీంతో చాలా మంది చనిపోయారు. 21 వేల సినిమాలు అతడి హార్డ్ డిస్క్‌లో ఉన్నాయి. రూ.20 కోట్లు పైరసీ ద్వారా సంపాదించాడు. అందులో రూ.3 కోట్లు సీజ్ చేశాం. 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా రవి వద్ద ఉంది. ఇంత డేటా అతడి వద్ద ఉండటం ప్రమాదకరం’అన్నారు.