ఈవారం బాక్సాఫీస్‌: ప్ర‌భాస్‌కు దారి ఇచ్చేశారు

ఓ పెద్ద సినిమా వ‌స్తోందంటే – బాక్సాఫీసుతో పాటు, మిగిలిన సినిమాలు ఎలెర్ట్ అయిపోతాయి. అందులోనూ స్టార్ హీరో సినిమా అంటే, మిగిలిన సినిమాలు సైలెంట్ మోడ్ లోకి వెళ్తాయి. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే వ‌చ్చింది. ఈనెల 27న `క‌ల్కి` వ‌స్తోంది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకొన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. నెల రోజుల ముందు నుంచే `క‌ల్కి` హ‌డావుడి ప్రారంభ‌మైపోయింది. 26 అర్థ‌రాత్రి నుంచే ప్రీమియర్లు ప‌డిపోతాయి. అందుకే ‘క‌ల్కి’ రాక కోసం ప్ర‌భాస్ ఫ్యాన్స్ తో పాటుగా, మొత్తం సినీ ప్రియులు వెయిటింగ్ లో ఉన్నారు.

‘క‌ల్కి’ ప్ర‌భావంతో వారం ముందుగానే బాక్సాఫీసు ఖాళీ అయిపోయింది. గ‌త‌వారం ఆరు సినిమాలు వ‌చ్చాయి. ఈవారం మ‌రో 3 సినిమాలు రెడీ అయ్యాయి. కానీ అన్నీ చిన్నా చిత‌కా సినిమాలే. కేవ‌లం థియేట‌ర్లు దొర‌కితే చాలు, అదే ప‌ది వేలు అనుకొనే కొన్ని సినిమాలు ఈవారం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. నింద‌, ఓ.ఎం.జీ, హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రాలు రాబోతున్నాయి. వీటిపై ఎవ‌రికీ ఏమాత్రం అంచ‌నాలు లేవు. ప్ర‌మోష‌న్ల ప‌రంగానూ ఈ చిత్రాలు స్పీడు చూపించ‌డం లేదు. థియేట‌ర్‌కి వెళ్లి చూడాల్సిందే అనేంత కంటెంట్ .. ఈ సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. గ‌త వారం చాలా సినిమాలొచ్చినా ‘మ‌హారాజ‌’కు మాత్ర‌మే వ‌సూళ్లు ద‌క్కాయి. ఈవారం కూడా అదే పెద్ద దిక్కుగా మారే అవ‌కాశం ఉంది. ఈనెల 27న ‘క‌ల్కి’ ఎలాగూ వ‌స్తోంది. `క‌ల్కి` త‌ర‌వాతి వారం కూడా తెలుగులో కొత్త సినిమాల హ‌డావుడి క‌నిపించ‌క‌పోవొచ్చు. అంటే… ‘క‌ల్కి’కి ముందూ, ఆ త‌ర‌వాత కూడా బాక్సాఫీసు ఖాళీనే. ‘క‌ల్కి’ స్టామినా చూశాకే, మిగిలిన సినిమాలు త‌మ విడుద‌ల తేదీలు, ప్ర‌మోష‌న్లు ప్లాన్ చేసుకొంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఎక్కడ ?

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వాయిస్ లేకుండా చేసింది. ఉద్యోగ సంఘం నేతల్ని ఉద్యోగుల వాయిస్ కాకుండా తమ వాయిస్ వినిపించేలా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి నోరు పెగలడం...

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close