పెద్ద నిర్మాత‌ల్లో గుబులు

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు ఎక్కువ అవుతున్న నేప‌థ్యంలో… కేంద్రం మ‌ళ్లీ నిబంధ‌న‌ల్ని క‌ఠిన‌త‌రం చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు విద్యాసంస్థల్ని తాత్కాలికంగా మూసేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. మెల్ల‌గా… థియేట‌ర్ల వైపు కూడా దృష్టి సారించే అవ‌కాశాలున్నాయి. క‌రోనా త‌ర‌వాత‌.. ఇప్పుడిప్పుడే చిత్ర‌సీమ పుంజుకుంటోంది. ఇప్పుడు మ‌ళ్లీ థియేట‌ర్ల‌ను మూసేస్తే.. చిత్ర‌సీమ మ‌రింత‌గా కృంగిపోతుంది. అయితే.. పూర్తి స్థాయిలో థియేట‌ర్ల‌ను మూసేసే అవ‌కాశం లేదు గానీ, క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీతో న‌డిపించుకునే అవ‌కాశం ఇవ్వొచ్చు. అలాగైనా రిస్కే. ఈ వేస‌విలో పెద్ద సినిమాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీ అనే నిబంధ‌న విధిస్తే.. బ‌డా సినిమాలు ఆగిపోతాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల్ని విడుద‌ల చేసుకునే ప‌రిస్థితిలో ఇప్పుడు ఏ నిర్మాతా లేడు. అన్ లాక్ ప్ర‌క్రియ మొదలైన కొత్త‌లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డ‌పుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించాయి. అప్ప‌ట్లో కూడా.. బ‌డా నిర్మాత‌లెవ‌రూ సంసిద్ధ‌త వ్య‌క్తం చేయ‌లేదు. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి ఎదురుకావొచ్చు.

మరోవైపు మ‌ళ్లీ లాక్ డౌన్ ప్ర‌క‌టిస్తారేమో అనే భ‌యాలు చిత్ర‌సీమ‌ను వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే టాలీవుడ్ నిర్మాత‌లు ఈ విష‌యంలో భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. `వ‌కీల్ సాబ్` నుంచి పెద్ద సినిమాల తాకిడి మొద‌ల‌వుతుంది. ఆ త‌ర‌వాతి నుంచి వ‌రుస‌గా.. బ‌డా సినిమాలే రాబోతున్నాయి. మే లో అయితే ఆచార్య‌, నార‌ప్ప‌, బాల‌య్య సినిమాలు రెడీ అవుతున్నాయి. వీట‌న్నింటికీ… ఇప్పుడు టెన్ష‌న్ ప‌ట్టుకుంది. అంతేకాదు… నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ టాలీవుడ్ లో షూటింగులు య‌మ స్పీడుగా జ‌రిగాయి. కొత్త సినిమాలు విరివిగా మొద‌ల‌య్యాయి. అయితే కొన్ని రోజుల నుంచి ఆ హ‌డావుడి బాగా త‌గ్గింది. మ‌ళ్లీ లాక్ డౌన్ విధిస్తారేమో అన్న భ‌యాల‌తోనే కొత్త సినిమాలు మొద‌లెట్ట‌డం లేద‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్ మార్కెట్ పెంచుకుంటున్న కన్నడ స్టార్

ఈ మధ్య భాషా బేధాలు లేకుండా అన్ని భాషలకి చెందిన సూపర్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్...

కేసీఆర్ కు ఏమైంది..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇదంతా గతం. అధికారం కోల్పోయాక ఆయన ప్రసంగంలో మునుపటి వాగ్ధాటి కనిపించడం లేదనే అభిప్రాయాలు...

బొత్స తండ్రి సమానుడా ? : షర్మిల

వైఎస్ జగన్ బొత్సను తన తండ్రి సమానుడు అని అనడం.. ఆయన విచిత్రమైన హావభావాలతో కంట తడిపెట్టుకున్నట్లుగా నటించడం, తర్వాత కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయడం విజయనగరం సిద్ధం సభలో కనిపించిన...

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close