టాలీవుడ్ నిర్ణ‌యం: మ‌రింత త‌గ్గ‌నున్న టికెట్ ధ‌ర‌లు

టికెట్ రేట్లు పెంచుకొంటూ పోవ‌డం వ‌ల్లే జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని, ఈ కార‌ణంతోనే థియేట‌ర్లు బోసిబోతున్నాయ‌ని, అర్జెంటుగా సినిమా టికెట్ రేట్లు త‌గ్గించాల్సి ఉంద‌ని.. నిర్మాత‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. కొద్ది రోజులుగా జ‌రుగుతున్న నిర్మాత‌ల స‌మావేశంలో తీసుకొన్న కీల‌క‌మైన నిర్ణ‌యాల్లో ఇదొక‌టి. ఎంత పెద్ద సినిమా అయినా స‌రే టికెట్ రేటు (మ‌ల్టీప్లెక్స్‌లో) రూ.150 దాట‌కూడ‌ద‌ని కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ రేటు అత్య‌ధికంగా రూ.70 గా నిర్ణ‌యించారు. ప‌ట్టాణాల‌లో టికెట్ రేటు.. రూ.100గా ఫిక్స‌య్యింది. ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా స‌రే, ఈరేటు మించ‌కూడ‌ద‌ని ఫిల్మ్ ఛాంబ‌ర్ స‌మావేశంలో నిర్మాత‌లు కీల‌క నిర్ణ‌యం తీసుకొన్నారు. ఓటీటీల విష‌యంలోనూ చ‌ర్చ‌లు సాగాయి. పెద్ద సినిమాని ప‌ది వారాల త‌ర‌వాతే ఓటీటీకి ఇవ్వాల‌ని, చిన్న సినిమా అయితే 4 వారాలు స‌రిపోతాయ‌ని ఛాంబ‌ర్ నిర్ణ‌యించింది. ప‌ని వేళ‌లు, కార్మికుల వేత‌నంపై చ‌ర్చ జ‌రిగినా, నిర్మాత‌లు ఏకాభిప్రాయానికి రాలేక‌పోయారు. దీని గురించి.. మ‌రో స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకొంటారు. హీరోల పారితోషికాల‌పై కూడా చ‌ర్చ సాగింది. అయితే వాటిని క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డం కుద‌ర‌ద‌ని కొంత‌మంది నిర్మాత‌లు బాహాటంగానే చెప్పేశారు. ”ఓ హీరోకి ఎంత ఇవ్వాల‌న్న‌ది నిర్మాత ఇష్టం. హీరోల డిమాండ్ మేర‌కే పారితోషికాలు ఉంటాయి. ‘వాళ్లు ఇంతే తీసుకోవాలి’ అని ఎవ‌రూ చెప్ప‌లేరు.. పెద్ద హీరోల విష‌యంలో ఈ రూల్ చెల్లుబాటు కాదు” అని ఓ నిర్మాత బాహాటంగానే త‌న అభిప్రాయం వ్య‌క్త ప‌రిచిన‌ట్టు టాక్. దాంతో… హీరోల పారితోషికాల విష‌యంలోనూ నిర్మాత‌లు ఓ అభిప్రాయానికి రాలేక‌పోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close