విల‌న్ల‌కు మ‌ళ్లీ కొర‌తొచ్చింది

సినిమా లెక్క‌లు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతున్నాయి. ఇది వ‌ర‌కు స్టార్ హీరో సినిమా అంటే, మిగిలిన కాస్టింగ్ ఎలా ఉన్నా ఫ‌ర్వాలేదు అనుకునే వారు. హీరోని చూసే జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారు కాబ‌ట్టి, వ‌ర్క‌వుటు అయిపోతుంద‌ని భావించే వారు. ఇప్పుడు అలా కాదు. స్టార్ హీరో ఉన్నంత మాత్రన స‌రిపోదు. మిగిలిన హంగులూ భారీగా ఉండాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్లు, విల‌న్లు.

రెగ్యుల‌ర్‌ విల‌న్ పాత్ర‌లు చూసీ చూసీ జ‌నాల‌కు మొహం మొత్తేసిన‌ప్పుడు, హీరోల్ని విల‌న్లుగా మార్చే సంప్ర‌దాయం మొద‌లైంది. అది కొంత‌కాలం బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్, ఆది పినిశెట్టి లాంటి హీరోలు కాల క్ర‌మంలో విల‌న్లుగా మారిపోయారు. ఈ క్ర‌మంలో బాలీవుడ్ నుంచి కొంత‌మంది విల‌న్ల‌ని దిగుమ‌తి చేసుకున్నాం. అర్జున్, ఉపేంద్ర, ఎస్‌జె సూర్య‌ లాంటి ప‌క్క రాష్ట్రం న‌టులు విల‌న్లుగా అవ‌త‌రించారు. ఇప్పుడు వాళ్లూ బోర్ కొట్టేశారు. ఇప్పటి సినిమాకు కొత్త విల‌న్లు కావాలి. ఎవ‌రూ చూడ‌ని విల‌నిజం చూపించాల‌ని ద‌ర్శ‌కులు తాప‌త్ర‌య ప‌డుతున్నారు. అయితే విల‌న్లు మాత్రం దొర‌క‌డం లేదు.

ఇటీవ‌ల ఓ స్టార్ హీరో సినిమా కోసం దేశ‌మంతా అన్వేషించినా విల‌న్ దొర‌క‌లేదు. విల‌న్ లేక‌.. ఆ సినిమా ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. ఇదే ప‌రిస్థితి చాలా సినిమాల‌కు కనిపిస్తోంది. మ‌హేష్‌, బ‌న్నీ, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌.. వీళ్ల‌కు విల‌న్ల‌ను వెదికి పెట్ట‌డం అతి పెద్ద స‌మ‌స్య‌గా మారింది. హీరో పాత్ర ఎలివేట్ అవ్వాలంటే, అంత‌కంటే శ‌క్తిమంత‌మైన విల‌న్ అవ‌స‌రం. అందుకే ఈమ‌ధ్య విల‌న్ల‌కు గిరాకీ పెరిగింది. అయితే అంద‌రీనీ ఓ రౌండ్ కొట్టేయ‌డం వ‌ల్ల‌, కొత్త విల‌న్లు దొర‌క్క‌పోవ‌డం వ‌ల్ల‌… ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ల‌కు కొర‌త వ‌చ్చిప‌డిపోయింది. ఇప్పుడున్న హీరోలు కొంత‌మంది విల‌న్లుగా మారడానికి ముందుకొస్తే త‌ప్ప‌, ఈ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం దొర‌క‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బోల్డ్ గా భయపెట్టిన లైగర్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజగా లైగర్ నుండి ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ...

ఎన్టీఆర్ కథ గోపిచంద్ కు

దర్శకుడు హరి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. 'సింగం' ఆయన సక్సెస్ఫుల్ సిరిస్. ఈ సిరిస్ కి తెలుగులో కూడా ఆకట్టుకుంది. హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు...

సీఎం జగన్ పేరుతో సైబర్ నేరాలు !

అప్పుడెప్పుడో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. కోట్లు కొట్టేయడానికి దర్జాగా కోల్‌కతా సూట్ కేస్ కంపెనీల పేరుతో చెక్‌లు జమ చేశారు. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. కానీ ఇప్పుడు...

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ – పబ్లిసిటీ బడ్జెట్ కోట్లకు కోట్లే !

సోషల్ మీడియా సంస్థలకు.. మీడియా సంస్థలకు పండగ లాంటి సమయం ఇది. వద్దంటే రాజకీయ పార్టీలు కుప్పలు కుప్పలుగా ప్రకటనలు ఇస్తున్నాయి. రూ. కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close