జగన్‌కు టాలీవుడ్ స్టార్ల ధ్యాంక్స్‌లే ధ్యాంక్సులు !

సీఎం జగన్‌కు ధ్యాంక్స్ చెప్పడానికే టాలీవుడ్ తారలు తాడేపల్లికి వచ్చినట్లుగా ఉంది. సీఎం జగన్‌తో దాదాపు గా గంట సేపు చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం అయిన తర్వాత క్యాంప్ ఆఫీస్ బయట ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అందరూ జగన్‌కు ధ్యాంక్స్ చెప్పడమే కీలకమైన ప్రకటనగా భావించారు. ఒక్క చిరంజీవి మాత్రం జగన్ సమస్యలను సావధానంగా విన్నారని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని.. ఈ రోజు సమస్యలకు శుభం కార్డు పడిందన్నారు.

ఆయన కూడా మాట్లాడిన రెండు నిమిషాల్లో నాలుగైదు సార్లు సీఎం జగన్‌కు ధ్యాంక్స్ చెప్పారు. టిక్కెట్ ధరలపై కొన్ని నెలలుగా ఉన్న అనిశ్చితికి తెరపడినట్లేనని .. తెలంగాణలోలా ఏపీలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనేది సీఎం ఆకాంక్ష అన్నారు. పాన్ ఇండియా సినిమాల విడుదల సమయంలో ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారని చిరంజీవి తెలిపారు. మూడో వారంలో జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.

ఇక ఈ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మహేష్ బాబు, ప్రభాస్‌లకు ఏం మాట్లాడారో అర్థం కాక మాటకో సారి జగన్‌కు ధ్యాంక్స్ చెప్పారు. వారం . పది రోజుల్లోనే శుభవార్త వస్తుందని ఆరు నెలల నుంచి ఇండస్ట్రీ గందరగోళంలో ఉందని.. ఇవాళ చాలా రిలీఫ్ అని మహేష్ బాబు అన్నారు.సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినందుకు హీరో ప్రభాస్ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ సమస్యల విషయంలో సీఎం జగన్‌కు స్పష్టమైన ‌అవగాహన ఉందని దర్శకుడు రాజమౌళి అన్నారు. మా విజ్ఞప్తులను సీఎం జగన్ విన్నారన్నారు. ఏ విధంగా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేసిన జగన్‌కు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు.

సినీ పరిశ్రమ ప్రముఖులు వచ్చి చర్చలు జరపడంతో సమస్యలు పరిష్కారం అవడానికి మార్గం సుగమం అయిందని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఎవరు పడితే వారు.. ఏది పడితే అది మాట్లాడినా చిరంజీవి పెద్ద మనసు చేసుకున్నారన్నారు. ఏపీలో షూటింగ్‌లు.. ఇతర ప్రభుత్వ పరమైన సహాయసహకారాల కోసం ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. మొత్తంగా జగన్‌కు కలిసి ధ్యాంక్స్ చెప్పడానికే ఈ రోజు సమావేశం జరిగినట్లుగా ప్రెస్‌మీట్ నడిచిపోయింద

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close