అగ్రరాజ్యాల కరెన్సీ వార్ : బ్లాక్ మండే ఒక ప్రమాద సూచిక!

శరవేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిణామాలు మరోసారి 1939 నాటి ఆర్థిక సంక్షోభం తప్పదనే సంకేతాలిస్తున్నాయని ఆర్ధిక నిపుణుల విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. పెట్టుబడుల మార్కెట్ లో ఏడు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరైపోయిన సోమవారం దేశ మార్కెట్‌ చరిత్రలో బ్లాక్‌ మండే. స్టాక్‌ మార్కెట్‌లో సంక్షోభం వారం రోజుల క్రితం ప్రారంభమై సోమవారానికి పరాకాష్టకు చేరింది.ఇది భారతస్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం రానున్న ఆర్థిక సంక్షోభ తీవ్రతకు ప్రమాద సూచిక.

2008 ప్రాంతంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ బెయిలవుట్‌ వంటి కాయకల్ప చికిత్సలతో అమెరికా, యూరప్‌ దేశాలు నెట్టుకొచ్చాయి.ఈ పరిణామాలు లిబరలైజ్డ్ ఆర్థిక విధానాల లొసుగుల్ని బయటపెడుతున్నాయి. తివాచీకిందక తోసేసిన ఆర్ధిక సంక్షోభ సర్పం సజీవంగానే కదులుతున్న సన్నివేశాన్ని ప్రస్తుత సం

గెయిల్‌, ఒఎన్‌జిసి, రిలయన్స్‌ ఇండిస్టీస్‌ సహా పలు ప్రఖ్యాత భారత కంపెనీల షేర్లు పదిహేను శాతం వరకూ నష్టపోయాయంటే ఇక చిన్న కంపెనీల పరిస్థితేంటో ఊహించవచ్చు. ఇదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఒక్క రోజే 68 పైసలు విలువ కోల్పోయి రూ.66.64కు చేరింది.

సెన్సెక్స్‌ 1,621.51 పాయింట్లు కోల్పోయి 25,741.56 పాయింట్ల వద్ద, నిఫ్టీ 490.95 పాయింట్లు కోల్పోయి 7,809 పాయింట్ల వద్ద ముగిశాయి. గడచిన ఏడేళ్లలో స్టాక్‌ మార్కెట్లు ఇంత భారీగా పతనం కావడం ఇదే ప్రథమం. సెన్సెక్స్‌ అతిపెద్ద పది పతనాల్లో ఎనిమిది ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభవించిన 2008లో నమోదయ్యాయి. మళ్లీ ఇపుడు ఆ స్థాయికి మార్కెట్లు పడిపోయాయి.

మన దేశమే కాదు ప్రపంచ మార్కెట్లు అమాంతం కుదేలు కావడానికి అమెరికా, చైనా, యూరప్‌ దేశాలు చేపట్టిన కరెన్సీ వార్‌ ప్రధాన కారణం. కరెన్సీ విలువ తగ్గించుకొని ఎగుమతులు పెంచుకుంటేనే మనుగడ సాగించగలమనే నిర్ణయానికొచ్చాయి ఆ దేశాలు. చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను వారం క్రితం తగ్గించింది. అక్కడి ప్రభుత్వం స్టాక్‌ మార్కెట్లకు మద్దతు ఇచ్చేందుకు పెన్షన్‌ నిధులను ఈక్విటీల్లో పెట్టుబడి పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. షాంఘై, హాంగ్‌సెంగ్‌, నిక్కీ, తైవాన్‌, తదితర మార్కెట్లు సోమవారం ఒత్తిడికి గురయ్యాయి. అమెరికాలో మాన్యుఫాక్చరింగ్ రంగంలో వృద్ధి మందగించింది ఫలితంగా వాల్‌స్ట్రీట్‌ నష్టాలకు గురవుతోంది.

గ్రీసులో రాజకీయ అనిశ్చితి ప్రభావం ప్రపంచ మార్కెట్లను పతనం వైపు నెడుతోంది. ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు అప్పు చెల్లించాల్సిన గడువు దగ్గర పడుతుండటంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మరోవైపు అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో భారీగా ధరలు పడిపోతున్నాయి. తాజా ప్రపంచ పరిణామాలతో ముడిచమురు ధర బ్యారెల్‌కు 40 డాలర్ల దిగువకు దిగజారింది. ప్రపంచంలోనే పెద్ద ఎగుమతిదారుగా ఉన్న చైనా సరఫరాలో మందగమనం చమురు ధర పతనానికి కారణమైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో జాతిర‌త్నాలు అవుతుందా?

ఈమ‌ధ్యకాలంలో చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి, వ‌సూళ్లు కొల్ల‌గొట్టి వెళ్తున్నాయి. `మ్యాడ్‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లూ చూస్తుంటే.. ఇందులోనూ ఏదో విష‌యం ఉంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సంగీత్‌...

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close