తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ చేపట్టిన రాజకీయ యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. కరూరు జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 30 మందికిపైగా చనిపోయారు. మరో యాభై మంది వరకూ గాయపడ్డారు. తమిళనాడులో విజయ్ రాజకీయ యాత్రలు ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన కరూలుజిల్లాలో కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నారు.
విజయ్ రావడానికి ముందే కనీసం ముఫ్పై వేల మంది గుమికూడారు. షెడ్యూల్ కన్నా విజయ్ ఆరు గంటల ఆలస్యంగా వచ్చారు. ఈ క్రమంలో ఆయనను చూసేందుకు ఒక్క సారిగా తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ వెంటనే స్పందించారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని ఆదేశించారు. సీనియర్ పోలీసు అధికారికి పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతలు ఇచ్చారు. ఆదివారం స్టాలిన్ బాధితుల్ని పరామర్శించే అవకాశం ఉంది.
ఈ ఘటనపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. మృతులకు సంతాపం తెలిపారు. విజయ్ సమక్షంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై విజయ్ వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందనరాలేదు. ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు. విజయ్ గత వారమే రాజకీయ యాత్రలు ప్రారంభించారు. ఇంతలోనే ఘోరవిషాదం జరగడం ఆయనకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.