నిమ్మగడ్డతో బదిలీల గేమ్ ఆడుతున్న ప్రభుత్వం ..!

పంచాయతీ ఎన్నికల విషయంలో లేని పోని పంతాలకు పోయి తల బొప్పి కట్టించుకున్న ఏపీ ప్రభుత్వం కొత్తగా… ఎస్‌ఈసీతో బదిలీల గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్‌ను ఎస్‌ఈసీ బదిలీ చేయమన్నారని.. సీఎస్ బదిలీ చేసేశారని మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే వాస్తవానికి ఎస్‌ఈసీ బదిలీ చేయమన్నది… ద్వివేదీ, గిరిజాశంకర్‌లను కాదు. గతంలో చెప్పినట్లుగా ఇద్దరు ఎస్పీలతో సహా తొమ్మిది మంది అదికారులను బదిలీ చేయమన్నారు. ముందు వారిని విధుల నుంచి తప్పించి కొత్త వారిని నియమిస్తే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందంటున్నారు. అయితే సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాత్రం.. వారిని బదిలీ చేయకుండా… మీనమేషాలు లెక్కిస్తున్నారు.

అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌తో అత్యవసర భేటీ తర్వాత పెద్ది గిరిజాశంకర్, గోపాలకృష్ణ ద్వివేదీలను బదిలీ చేసేశారని.. ఎంత మందిని బదిలీ చేయించుకున్నా.. తాము వెనక్కి తగ్గబోమని చెప్పుకొచ్చారు. అసలు బదిలీ చేయకుండానే పెద్ది రెడ్డి .. అలా ప్రకటన చేశారంటే.. ప్రభుత్వం వ్యూహాత్మకంగా బదిలీలపై తప్పుడు ప్రచారం ప్రారంభించిందనే అభిప్రాయానికి రాజకీయవర్గాలు వస్తున్నాయి. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లు తప్పు చేశారు. ఎస్‌ఈసీ ప్రకటించినా ఓటర్ల జాబితా ప్రిపేర్ చేయలేదు. అది న్యాయస్థానాల ముందు తీవ్ర నేరంగా ఉంటుంది. దీంతో వారిపై చర్యలు తీసుకోవడం ఖాయమని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో వారిని ఎస్‌ఈసీ తప్పించడానికన్నా ముందే.. బదిలీ చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

అందుకే ఈ మేరకు మీడియాకు లీక్ ఇచ్చారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో… ఉన్నతాధికారుల్నే కాదు.. ఎవర్నీ బదిలీ చేయాలన్నా ఓ ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారం.. వెంటనే బదిలీ చేయలేరు. ఎస్‌ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే చిక్కు ముడి ఏర్పడింది. ఎస్‌ఈసీనే బదిలీ చేసిందని ప్రచారం చేయడంతో ఇప్పుడు ఆ బదిలీలను చేయవద్దని… ఎస్ఈసీ ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ ప్రచారానికి చెక్ పడినట్లవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close