స‌మంత విడుద‌ల చేసిన దృష్టి ఫ‌స్ట్ లుక్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్

అందాల రాక్ష‌సి, అలా ఎలా సినిమాల‌తో ప్రేక్ష‌కుల మన‌సు గెలుచుకున్న రాహుల్ ర‌వీంద్ర‌న్ క‌థానాయకుడిగా, ఎమ్ స్వేర్ బ్యాన‌ర్ పై రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ‘దృష్టి. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను ప్ర‌ముఖ సినీ హీరోయిన్ స‌మంత చేతుల మీదుగా విడుద‌ల అయింది.

ఈ సంద‌ర్భంగా, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాట్లాడుతూ, స‌మంతతో ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. రాహుల్ ను ఇంత‌కుముందెన్న‌డూ చూడ‌ని విధంగా ఈ సినిమాలో చూడ‌నున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి, సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.
రాహుల్ ర‌వీంద్ర‌న్ హీరోగా, ప‌వ‌ని గంగి రెడ్డి హీరోయిన్లుగా ప‌నిచేస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, స‌త్య ప్ర‌కాష్, ర‌వి వ‌ర్మ‌, ప్ర‌మోదిని.. త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

సాంకేతిక నిపుణులుః
మేనేజ‌ర్ః జె వి డి ప్ర‌సాద్
కో ప్రొడ్యూస‌ర్ – శ్రీనివాస్ మోతుకూరి
క‌థ – బి.బి కిర‌ణ్ (బి. భాను కిర‌ణ్)
ఎడిట‌ర్ – ఉద్ద‌వ్ ఎస్ బి
సినిమాటోగ్ర‌ఫీ – పి.బాలరెడ్డి
సంగీతం- న‌రేష్ కుమార‌న్
బ్యాన‌ర్ – ఎమ్ స్వేర్
నిర్మాత – మోహ‌న్
క‌థ‌, క‌థ‌నం – రామ్ అబ్బ‌రాజు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.