ర‌వితేజ చుట్టూ తిరిగి.. చివ‌రికి

సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ సినిమాల‌తో ఆక‌ట్టుకున్నాడు త్రినాథ‌రావు న‌క్కిన. ఒక్క‌సారిగా పెద్ద హీరోల దృష్టిలో ప‌డ్డాడు. వెంక‌టేష్‌, ర‌వితేజ‌ల కోసం క‌థ‌లు సిద్ధం చేశాడు. వెంక‌టేష్‌తో దాదాపు ఖాయం అనుకున్న ద‌శ‌లో.. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ త‌ర‌వాత‌… ర‌వితేజ‌తో ట్రావెల్ మొద‌లెట్టాడు. అయితే… త్రినాథ‌రావు ని ప‌క్క‌న పెట్టి, మిగిలిన క‌థ‌ల్ని ప‌ట్టాలెక్కించ‌డం మొద‌లెట్టాడు ర‌వితేజ‌. ఎంత‌కాలమ‌ని సినిమా కోసం వెయిట్ చేయ‌డం.. అందుకే మ‌రో హీరోని వెదుక్కున్నాడు త్రినాథ‌రావు.

ఎట్ట‌కేల‌కు ఇప్పుడు హ‌వీష్ తో సినిమా చేస్తున్నాడ‌ట‌. `నువ్విలా` సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు హ‌వీష్‌. ఆ సినిమా హిట్ట‌యినా క్రెడిట్ మొత్తం ర‌విబాబు ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ త‌ర‌వాత‌.. `జీనియ‌స్`, `రామ్ లీలా`, `సెవెన్‌` చేశాడు. ఏవీ ఆడ‌లేదు. ఇప్పుడు త్రినాథ‌రావు న‌క్కిన‌.. హ‌వీష్ తో ఓసినిమా చేస్తున్నాడు. ఇది ర‌వితేజ కోసం రాసుకున్న క‌థే అని తెలుస్తోంది. ర‌వితేజ క‌థ‌… హ‌వీష్‌కి ఎలా సెట్ చేశారో మ‌రి..? సినిమా సినిమాకీ ఎద‌గాల‌ని, పెద్ద హీరోల‌తో సినిమాలు చేయాల‌ని భావిస్తుంటారు ద‌ర్శ‌కులు. కానీ.. త్రినాథ‌రావు మాత్రం రివ‌ర్స్ గేర్ మంత్రం పాటిస్తున్నాడు. హీరోలు దొరక్క‌పోతే ద‌ర్శ‌కులు మాత్రం ఏం చేస్తారు? దొరికిన వాళ్ల‌తోనే స‌ర్దుకుపోతారు. త్రినాథ‌రావు న‌క్కిన కూడా అంతే ఇప్పుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close