”మ్యాడ్ సినిమా ఫంక్షన్లో కలిసినప్పుడు అది దేవరనామ సంవత్సరం అని చెప్పాం. ఈ సంవత్సరాన్ని హృతిక్ రామారావు సంవత్సరంగా ప్రకటిద్దాం. ఎందుకంటే వారిద్దరినీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. వార్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు.
”డాన్స్ గ్లింప్స్ చూస్తుంటే నిజంగానే రెండు కళ్ళు సరిపోవడం లేదు. యాక్షన్ ఫైట్లే కాదు, దానికి మించిన ఒక సర్ప్రైజ్ ఈ సినిమాలో ఉంది. యాక్షన్ ఫైట్లు సినిమా చేయాలంటే డైరెక్టర్ అయాన్ ఎన్టీఆర్ గారి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ గారికి ఉన్న పేరే ఎలాంటి ఎమోషన్ అయినా పలికిస్తారని. మనం బంగారాన్ని తెచ్చుకున్న తర్వాత దానితో నగ చేయించుకోవాలనుకుంటాం. బీరువాలో పెట్టి దాచాలనుకోం. సిల్వర్ స్క్రీన్కు వన్నె తెచ్చే నటుడు ఎన్టీఆర్. ఆయనని ఎలా వాడాలో తెలిసిన డైరెక్టర్ అయాన్’ అన్నారు.
‘ఈ సినిమా టైటిల్ వార్ అని పెట్టారు. కానీ వాళ్ళిద్దరూ బయట చాలా మంచి స్నేహితులుగా కనిపిస్తున్నారు. సినిమాలో మంచి ఎవరు? చెడ్డ ఎవరు? అనేదాని కంటే… ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఒక మంచి సినిమా అవుతుంది అనిపిస్తుంది. ఎన్టీఆర్, హృతిక్… ఒకరు వింధ్య పర్వతం, మరొకరు హిమాలయ పర్వతం. అలాంటి వాళ్ళిద్దర్నీ ఒకే చోట కూర్చోబెట్టి సినిమా తీయాలంటే మాటలు కాదు. అయాన్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి’ అన్నారు.
ఈ వినాయక చవితి వార్ 2 వారం రోజులు ముందే తీసుకొస్తుంది. ఈసారి గణేష్ మండపంలో ఈ వార్ పాటే మోగుతూ ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఇష్టమైన తారక్‌ని దేవర తర్వాత ఇప్పటివరకు చూడకుండా వేచి ఎదురుచూస్తున్నారు. నిరీక్షణ ముగిసింది. ఆగస్టు 14న థియేటర్స్‌లో కలుద్దాం. ఇద్దరు టైటాన్స్‌ని వెండితెరపై చూద్దాం’ అన్నారు.