పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. 2017 ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబరు నెలాఖరున గానీ, జనవరి మొదటి వారంలోగానీ చిత్రీకరణ ప్రారంభిస్తారు. త్రివిక్రమ్ స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. అయితే.. ఈ కథ, దాని వెనుక ఆలోచనల వెనుక పవన్ ప్రమేయం ఫుల్లుగా ఉన్నట్టు సమాచారం. బేసిగ్గా త్రివిక్రమ్ కథకుడు. తన దగ్గర కథలకు లోటు లేదు. అయితే ఈసారి పవన్ చెప్పిన `లైన్`ని త్రివిక్రమ్ డవలప్ చేశాడని చెబుతున్నారు. ఈసారి త్రివిక్రమ్‌తో ఎలాంటి సినిమా చేయాలన్న విషయంలో పవన్‌కంటూ స్పష్టమైన ఆలోచనలున్నాయని, అవే.. త్రివిక్రమ్‌తో పంచుకొని.. ‘నాకు ఇలాంటి కథ కావాలి..’ అని చెప్పి చేయించుకొంటున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. హీరో క్యారెక్టరైజేషన్, కథలోని సంఘర్షణ… వీటిన్నంటినీ డిజైన్ చేసింది పవన్ కల్యాణే.
ఇది వరకు జల్సా విషయంలో ఇదే జరిగిందది. అతడు కథని మహేష్ కంటే ముందు పవన్‌కి వినిపించాడు త్రివిక్రమ్. ఆ కథ పవన్‌కి నచ్చలేదు. అయితే.. ఆ సినిమా బాగా ఆడింది. ఆ కథని త్రివిక్రమ్ నడిపించిన విధానం కూడా బాగా నచ్చింది. దాంతో.. త్రివిక్రమ్‌ని మళ్లీ పిలిపించాడు పవన్. ఆ సమయంలో వేరే కథ చెబితే.. ‘జల్సా’ అవుట్‌లైన్ చెప్పాడట పవన్. ఆ సినిమాలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ పవన్ ఆలోచనే. ఈసారీ… అదే పంథా ఫాలో అవుతున్నాడు పవన్. పేదరికం, అవినీతి.. వీటిపై ఫోకస్ చేస్తూ కథ కావాలని చెప్పి.. దానికి తగ్గట్టుగానే క్యారెక్టర్లు డిజైన్ చేయిస్తున్నాడట. జల్సా సినిమా బాగున్నా… నక్సలిజం బ్యాక్ డ్రాప్లో సాగే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అంటే.. ఒక విధంగా పవన్ యాడింగులు ఫెయిల్ అయ్యాయన్నమాట. మొన్నటికి మొన్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’కి కథ, స్ర్కీన్ ప్లే కూడా పవన్ సమకూర్చాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరి.. అదే సెంటిమెంట్ ఈ సినిమాకీ కొనసాగుతుందా?? అనే భయాలు నెలకొన్నాయి. అయితే.. ఇక్కడున్నది త్రివిక్రమ్ కాబట్టి ఏదోలా బండి లాగించే అవకాశాలున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.