సునీల్ కోసం త్రివిక్ర‌మ్ ప్ర‌యోగం

సునీల్ – త్రివిక్ర‌మ్ కెరీర్‌లు ఒకేసారి మొద‌ల‌య్యాయి. ఒకేసారి విశ్వ‌రూపం దాల్చాయి. వాళ్ల ఫ్రెండ్ షిప్ సినిమా సినిమాకీ… స్ట్రాంగ్ అవుతూ వెళ్లాయి. ఓ ద‌శ‌లో సునీల్ హీరోగా, త్రివిక్ర‌మ్ ఓ సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. `బంతి` అనే పేరు కూడా వినిపించింది. అయితే అదేం కార్య‌రూపం దాల్చ‌లేదు. క‌మెడియ‌న్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లెట్టాక‌.. త్రివిక్ర‌మ్ సినిమాల్లో మంచి క్యారెక్ట‌ర్లే ప‌డ్డాయి సునీల్ కి. అయితే అవేం ఇది వ‌ర‌క‌టి స్థాయిలో లేవన్న‌ది నిజం.

అందుకే ఇప్పుడు త‌న స్నేహితుడు సునీల్ కోసం ఓ వెరైటీ క్యారెక్ట‌ర్ ని సృష్టించాడ‌ట త్రివిక్ర‌మ్. ఎన్టీఆర్ తో మాట‌ల మాంత్రికుడు ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సునీల్ కి చాలా మంచి పాత్ర ప‌డింద‌ట‌. అయితే ఈసారి మాత్రం సునీల్ కామెడీ చేయ‌డు. అలాగ‌ని సీరియ‌స్ టైపు పాత్ర కూడా కాదు. ఈ రెండింటికీ అంద‌ని ఓ క్యారెక్ట‌ర్‌.. రాశాడ‌ట‌. సునీల్ ఇలాంటి పాత్ర కూడా చేయ‌గ‌ల‌డా? అనుకునేలా ఈ క్యారెక్ట‌ర్‌ని త్రివిక్ర‌మ్ తీర్చిదిద్దాడ‌ని తెలుస్తోంది. నిజానికి.. ముందు అనుకున్న స్క్రిప్టులో సునీల్ పాత్ర లేదు. లాక్ డౌన్‌లో స్క్రిప్టుని మ‌ళ్లీ రీ రైట్ చేసే వీలు ద‌క్కింది త్రివిక్ర‌మ్ కి. ఆ టైమ్ లో సునీల్ పాత్ర‌.. కొత్త వ‌చ్చి చేరింద‌ట‌. సునీల్ కెరీర్‌లో ఇదో ఛాలెంజింగ్ రోల్ అవుతుంద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close