కోలీవుడ్ వైపు త్రివిక్రం చూపు

తెలుగులో స్టార్ రచయితగా, స్టార్ డైరక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలున్న త్రివిక్రం ప్రస్తుతం చేస్తున్న నితిన్ ‘అ..ఆ’ సినిమా తర్వాత కోలీవుడ్ హీరోతో ఓ సినిమా చేస్తున్నాడనే వార్త ఫిల్మ్ నగర్లో సంచరిస్తుంది. అ..ఆ సినిమా సమ్మర్ రిలీజ్ చేసేలా షూటింగ్ చేస్తున్నాడు త్రివిక్రం. తన హోప్స్ పెట్టుకున్న స్టార్ హీరోలందరు హ్యాండ్ ఇవ్వడంతో నితిన్ సినిమా తర్వాత కోలీవుడ్ ఓ హీరోతో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.

తెలుస్తున్న కథనాల ప్రకారం త్రివిక్రం సూర్య కలిసి ఓ బైలింగ్వల్ మూవీ ప్లాన్ చేస్తున్నారన్నది మ్యాటర్. సూర్య ప్రస్తుతం ’24’ సినిమా బిజీలో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత ‘సింగం-3’ కూడా చేసి త్రివిక్రంతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని కోలీవుడ్ మీడియా హడావిడి చేస్తుంది. మహేష్, పవన్ లతో తర్వాత సినిమా ఉంటుందని భావించిన త్రివిక్రం ఇద్దరు తనతో చేయడానికి రెడీగా లేరని తెలిసి సూర్యతో సినిమా చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమాను స్టూడియో గ్రీన్ జ్ఞావెల్ రాజా, హారిక & హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ కలిసి నిర్మిస్తున్నారట. ప్రస్తురం త్రివిక్రం చేస్తున్న ‘అ..ఆ’ మూవీ కంప్లీట్ అవ్వగానే ఈ సినిమాకు సంబంధిచిన ఎనౌన్స్ మెంట్ బయటకు వస్తుందని అంటున్నారు. మొత్తానికి విలక్షణ నటుడితో మాటల మాంత్రికుడి సినిమా అంటే అది కచ్చితంగా ట్రెండ్ సెట్ చేయడం ఖాయమనే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close