ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ‘వేడాట్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటిస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆరంభమైంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇలా లుక్ రిలీజ్ అయిందో లేదో కాసేపటికే ట్రోల్స్ మొదలైపోయాయి.
ఒక రాజమహల్లో అక్షయ్ నడిచి వస్తున్న వీడియోలో వెనుక ట్యూబ్ లైట్లతో కూడిన భారీ జూమర్ ఈ ట్రోల్స్‌కు కారణమైంది. శివాజీ బతికి ఉన్న కాలానికి ప్రపంచంలో ఎక్కడా విద్యుత్ లేదు. అప్పటికి బల్బు ఆవిష్కరణ జరగలేదు. దీంతో నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే అక్షయ్ గడ్డం కూడా కృత్రిమంగా కనిపిస్తోంది. అక్షయ్ కుమార్ లాంటి హీరోని పెట్టుకొని శివాజీ మహారాజ్ లాంటి వీరుడి బయోపిక్ తీసుతున్నపుడు కనీసం జాగ్రత్తలు వహించాలి. ఈ విషయంలో అక్షయ్ టీం పెద్ద శ్రద్ధ పెట్టినట్లుగా కనిపించడం లేదు.