పార్లమెంటులో కూడా సీట్ బెల్ట్ కోసం వెతుకొంటారు మోడీ!

జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కూడా పెరుగుతున్నాయి. తెరాస మంత్రి కె.తారక రామారావు నేరుగా ప్రధాని నరేంద్ర మోడి మీదనే విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం విమానాలలో తిరగడం అలవాటయిపోయిన కారణంగా ఆయన పార్లమెంటులో కూర్చోనప్పుడు కూడా సీట్ బెల్టు కోసం వెతుకొంటారు, అని ఎద్దేవా చేసారు. తెలంగాణా రాష్ర్టం ఏర్పడి ఇప్పటికి 18 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఆయనకి తెలంగాణా వచ్చేందుకు తీరిక, ఆసక్తి లేవని కానీ నిత్యం విదేశాలు తిరుగుతుంటారని విమర్శించారు.

కె.తారక రామారావు నిన్న ధూల్ పేటలోని జుమ్మేరాత్‌ బజారులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడిని విమర్శించడమే కాకుండా రాష్ట్ర బీజేపీ నేథలకి కూడా సవాలు విసిరారు. ఎవరూ అడగకపోయినా బీహార్ కి 1.25 లక్షల కోట్లు ఆర్ధిక ప్యాకేజి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రూ.80, 000 కోట్ల ప్యాకేజి ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణాకు ఎందుకు పైసా విదిలించడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలకు దమ్ముంటే నరేంద్ర మోడీ వద్దకు వెళ్లి తెలంగాణా రాష్ట్రానికి కూడా లక్ష కోట్లు ఆర్ధిక ప్యాకేజి అడిగి తీసుకురావాలి అని సవాలు విసిరారు. తమ పార్టీ బీజేపీలాగ హామీలు ఇచ్చి మరిచిపోయే పార్టీ కాదని అన్నారు. ధూల్ పేట ప్రజల కోసం ఆ ప్రాంతంలో ఒక పెద్ద పరిశ్రమను నెలకొల్పబోతున్నట్లు కె.తారక రామారావు ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోడిపై కె.టి.ఆర్. చేస్తున్న విమర్శలను కేంద్ర కార్మిక, పెట్రోలియం శాఖా మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, బండారు దత్తాత్రేయ తప్పు పట్టారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి జన్మదినం సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి ధర్మేన్ ప్రాధాన్ మాట్లాడుతూ “కె.టి.ఆర్. ముఖ్యమంత్రి కుమారుడు అయినంత మాత్రాన్న ఆయన అంత అహంకారం ప్రదర్శించడం మంచి పద్దతి కాదు. ప్రధాని మోడిని విమర్శించేముందు, మీ తండ్రి కేసీఆర్ వారంలో ఎన్నిసార్లు సచివాలయానికి వస్తున్నారో తెలుసుకోవాలని అన్నారు. ఒకవేళ ప్రధాని మోడీ ఏమి చేస్తున్నారో కె.టి.ఆర్.కి తెలియకపోతే, తన తండ్రి కేసీఆర్ ని అడిగి తెలుసుకొంటే మంచిది,” అని హితవు పలికారు.

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ “రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పధకాలకు కేంద్రమే నిధులు అందిస్తోందనే విషయం మంత్రి కె.టి.ఆర్.కి తెలియదా? తెలంగాణా ప్రభుత్వం అడగగానే నిరంతర విద్యుత్ సరఫరా పధకం మంజూరు చేసిన సంగతి ఆయనకి తెలియదా?ఎంఎంటీఎస్‌ రెండో దశను పూర్తి చేయడానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తున్న విషయం ఆయనకీ తెలియదా? కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇంత చేస్తుంటే కె.టి.ఆర్. నోటికి వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడిని విమర్శించడం తగదు,” అని హితవు పలికారు. జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో తెదేపా, బీజేపీ కూటమిని గెలిపించినట్లయితే కేంద్రం హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తుందని బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయసాయిరెడ్డి నీళ్లు నమిలిన ప్రశ్న..!

రఘురామకృష్ణంరాజుకు వేటు కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి బృందానికి .. లోక్‌సభ స్పీకర్ ఏం చెప్పారో .. ఏం హామీ ఇచ్చి పంపారో కానీ బయట మీడియా దగ్గర మాత్రం...

లద్దాఖ్‌లో సడన్‌ టూర్.. చైనాకు హెచ్చరికలు పంపిన మోడీ..!

భారత భాభాగాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ.. చర్చల పేరుతో టైంపాస్ చేస్తున్న చైనా కు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యూహాత్మకంగా అడుగులేశారు. హఠాత్తుగా చైనా సరిహద్దుల్లో పర్యటించారు. అక్కడి సైనికులతో...

ఆర్ఆర్ఆర్‌పై ఎలా వేటేయాలో కూడా స్పీకర్‌కు చెప్పిన వైసీపీ బృందం..!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు వేయాలని వైసీపీ నేతలు.. స్పీకర్ ఓంబిర్లాకు వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంలో వారు.. పలు కోర్టు తీర్పులను...

వ‌ర్మ టీమ్‌లో ‘క‌రోనా’ భ‌యం

లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ... సినిమాలు తీసే ధైర్యం చేశాడు రాంగోపాల్ వ‌ర్మ‌. అవి ఎలాంటి సినిమాలు? ఎవ‌రికి న‌చ్చాయి? అనేది ప‌క్క‌న పెడితే - క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లోనూ ప‌నైతే చేయ‌గ‌లిగాడు. వ‌ర్మ‌కి...

HOT NEWS

[X] Close
[X] Close