ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు షాక్..! మూడో స్థానంలోనే ఉపాధ్యాయ, పట్టభద్రుల అభ్యర్థులు..!

తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఎస్ యూటీఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి.. పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌పై 2637 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 8924 ఓట్లు రాగా, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌కు 6287 ఓట్లు వచ్చాయి. గతంలో నర్సిరెడ్డి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌కి అధికార పార్టీ టీఆర్‌ఎస్ తన మద్దతును ప్రకటించగా, టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి సీపీఎం తమ మద్దతును ప్రకటించింది.

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ బలపరిచిన పాతూరి సుధాకర్‌రెడ్డి పరాజయం పాలయ్యారు. లెక్కింపు జరుగుతూండగానే… కౌంటింగ్‌ కేంద్రం నుంచి పాతూరి సుధాకర్‌రెడ్డి వెళ్లిపోయారు. పీఆర్టీయూ అభ్యర్థికి మొదటిరౌండ్‌లో 610 ఓట్ల ఆధిక్యం వచ్చినట్లు సమాచారం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యత చూపించారు. టీఆర్‌ఎస్ మద్దతుతో బరిలో నిలిచిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ నాలుగో స్థానానికి పరిమితమయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి మూడు నెలలు కాక ముందే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరపరాజయాలు ఎదురవుతాయని టీఆర్ఎస్ ఊహించలేకపోయింది.

మండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా చేయాలన్న పట్టుదలతో.. కేసీఆర్ ఇప్పటి వరకూ రాజకీయం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం కాంగ్రెస్ పార్టీకి రావాల్సి ఉన్నా… రాకుండా చేశారు. దాంతో.. ఇక మండలిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేకుండా పోతుందేమోనని.. అందరూ అనుకున్నారు. జీవన్ రెడ్డి… పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలిచినప్పటికీ.. గెలుపుపై చాలా మందికి అనుమానం ఉంది. ఎందుకంటే.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించింది. దాతో.. టీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థే గెలుస్తారనుకున్నారు. కానీ.. పరిస్థితి మారిపోయింది. జీవన్ రెడ్డి విజయం అంచున ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున..ఫలితాలను… అధికారికంగా ప్రకటించే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనధికారికంగా మాత్రం… విషయం బయటకు వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close