టీఆర్ఎస్ తరపున “సాక్షి” మైండ్ గేమ్..!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడాన్ని… అమ్ముడుపోవడంగా చెబుతున్న సాక్షి పత్రిక… పొరుగున ఉన్న తెలంగాణలో మాత్రం…కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరకపోతే పాపం అన్నట్లుగా కథనాల మీద కథనాలు రాసుకొస్తోంది. నేరుగా పేర్లు పెట్టి రాసి.. బ్యానర్‌ గా.. పోటోలు పెట్టి.. వీళ్లు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే… ప్రచారాన్ని .. ఉద్ధృతంగా చేస్తోంది. నిజంగా ఇలా రాయాలంటే… విలువలు పాటించే పత్రిక ఏదైనా.. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే రాస్తుంది. గాసిప్స్‌గా రాయాలంటే… ఓ హింట్ ఇస్తుంది. కానీ సాక్షి మాత్రం.. టీఆర్ఎస్ కోసం.. తన పత్రికా విలువన్నింటినీ తుంగలో తొక్కి.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరి పేర్లు పెట్టి మరీ రాసి.. వారంతా టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని చెప్పుకొస్తోంది.

నిజానికి.. సాక్షి పత్రికలో వచ్చిన వలసల కథనంలో.. ఎవరెవరు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారు.. వారిని ఎవరు ఆహ్వానించారన్నదానిపై క్లారిటీ లేదు. అంతే కాదు.. తాము టీఆర్ఎస్‌లో చేరబోవడం లేదని గతంలో ఖండించారు కూడా. అయినప్పటికీ.. వారందరూ టీఆర్ఎస్‌లో చేరితే.. ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తారో.. విపులంగా చర్చిస్తూ… వివరిస్తూ.. కథనాన్ని ప్రచురించింది. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ చేరితే రెండో విడతలో మంత్రి పదవట.. అలాగే.. కుమారుడికి లోక్ సభ టిక్కెట్ అట. .. ఇలా.. దాదాపుగా ఎమ్మెల్యేలందరికీ.. టీఆర్ఎస్‌లో చేరితే ఏం ప్రయోజనాలు దక్కుతాయో చూచాయగా కూడా రాసుకొచ్చారు. అంటే.. టీఆర్ఎస్ తరపున ఆ ఎమ్మెల్యేలకు ప్రతిపాదనలు పెట్టారన్నమాట.

పదహారో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. ఈ లోపే… కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకుండా… ఎమ్మెల్యేలను ఆకర్షించాలని టీఆర్ఎస్ నేతలు పట్టుదలగా ఉన్నారు. ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం.. సాక్షి పత్రిక ద్వారానే ప్రతిపాదనలు పంపుతున్నట్లుగా భావిస్తున్నారు. ముందుగా.. ఇలా పేర్లు పెట్టి ప్రచారం చేసి.. మైండ్ గేమ్ జరిపితే.. తర్వాత వాళ్లపై పార్టీలో అనుమానాలు పెరుగుతాయని.. తప్పని సరిగా.. టీఆర్ఎస్‌లో చేరాల్సిన పరిస్థితి వస్తుందని… అంచనా వేసినట్లు ఉన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను.. జగన్.. హీరోగా భావిస్తున్నారు. తన హీరోకి.. తెలంగాణలో జగన్ ఉడతా భక్తి సాయాన్ని ఇలా చేస్తున్నారు. అదే తన ఎమ్మెల్యేలు… తన నాయకత్వంపై వ్యతిరేకత బహిరంగంగా వ్యక్తం చేసి.. ఇతర పార్టీల్లో చేరిపోతే మాత్రం అమ్ముడు పోయినట్లు లెక్క.. !.. అదే తెలంగాణలో అయితే ఓ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరడానికి తన పత్రిక ద్వారానే మైండ్ ఆడిస్తూ ఉంటారు. ..! ఎంతైనా జగన్‌కు.. ఆయన దినపత్రికకు… ఏ రాష్ట్రంలో విలువలు ఆ రాష్ట్రం వరుకే ఉంటాయని.. మరోసారి తేలిపోయింది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close