బీఫ్‌ వివాదంలో సేఫ్‌గా….

Telakapalli-Raviహైదరాబాదును విశ్వనగరంగా చేస్తామని మంత్రి కెటిఆర్‌ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కాదు మా తాత, తండ్రి ఇప్పటికే దాన్ని అభివృద్ధి చేశారని లోకేష్‌ బాబు చెప్పుకుంటున్నారు. అసలు మీ అందరినీ మించి ఈ దశకు తెచ్చింది మా పాలనేనని కాంగ్రెస్‌ నాయకులూ తమ పల్లవి తాము ఆలపిస్తున్నారు. అయితే అన్ని పార్టీలూ…ఇతరుల పాలన కారణంగానే ప్రజా సమస్యలు పేరుకుపోయాయంటూ పరిష్కారం కావాలంటున్నాయి. ట్రాఫిక్‌, డ్రైనేజీ, శాం భద్రతల వంటి అంశాలు ప్రస్తావిస్తున్నాయి. టాప్‌ సిటీ కాదు సేఫ్‌ సిటీగా చేయాలని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

మరో వైపున లూప్‌లైన్‌లో తన ప్రచారం చేసుకుంటూ పోయే మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బిజెపి, టిడిపి గెలిస్తే నగరంలో బీఫ్‌ తినే అవకాశం వుండదని ఆరోపించారు. ఆ వెంటనే కొన్ని ఛానళ్లు దానిపై దుమారం సృష్టించే ప్రయత్నం చేశాయి. మామూలుగా ఏదైనా బల్లగుద్ది వాదించే టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ దీనిపై ఎటూ కాకుండా మాట్లాడారు. బీప్‌కు అనుకూలంగా లేక వ్యతిరేకంగా మాట్లాడితే నష్టమని నానాతంటాలు పడ్డారు. అదే చర్చలో కాంగ్రెస్‌ మాజీ ఎంపి ఒవైసీ వ్యాఖ్యలను ఖండిస్తూ టిఆర్‌ఎస్‌ వైఖరి చెప్పాలని రెట్టించి అడిగారు.

ఇక ప్రచారంలో ప్రవేశించిన సీనియర్‌ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వచ్చీ రాగానే బీఫ్‌ గురించిన వివాదాన్నే ప్రధానంగా తీసుకుని మతతత్వాలు రగుల్కొల్పరాదని సూక్తులు చెప్పారు. ఆహారం వేష భాషలు వంటి విషయాల్లో వారి వారి ఇష్ట ప్రకారం వ్యవహరించవచ్చునని అంతా అనుకుంటున్నప్పుడు బీఫ్‌పై లేనిపోని వివాదం అవసరమా? ఒవైసీ మాటలను నిజంగా ఖండించాలంటే టిఆర్‌ఎస్‌ తాము ఏ అహారానికి వ్యతిరేకం కాదని ప్రకటించాలి. కాని కర్ర విరగకుండా పాము చావకుండా వుండాలంటే బీఫ్‌పై సేఫ్‌గా బయిటపడాలని టిఆర్‌ఎస్‌ భావిస్తున్నది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో విచారణకు ఆదేశించిన నిమ్మగడ్డ..!

స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో చేసిన వాస్తు మార్పులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సీరియస్ అయ్యారు. ఎవరు చెబితే ఆ మార్పులు చేశారో తనకు తెలియాలంటూ..విచారణకు ఆదేశించారు. నిమ్మగడ్డ తన ఆఫీసులో జరిగిన...

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

HOT NEWS

[X] Close
[X] Close