ఉపశమనం-పశ్చాత్తాపం

Telakapalli-Raviజిహెచ్ఎంసి ఎన్నికలపై హైకోర్ట్ ఆదేశం కెసిఆర్ ప్రభుత్వ స్వయంకృతాపరాధమనే మాట అంతటా వినిపిస్తున్నది. రాజకీయంగా అనుకూలత, ఆదిక్యత సాధించుకున్న సర్కారు అత్యాశకు పోయి అభాసుపాలైందని ఆ పార్టీ ముఖ్యులు కొందరు వాపోతున్నారు. సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నా ఎన్నికల గడువు కుదించడం వంటి పనులు చేయాల్సిన అవసరమేమిటి? ఈ నాలుగు రోజులతో ఒరిగేదేమీ ఉంటుంది…చెడ్డపేరు తెచ్చుకోవడం తప్ప..అని ఒక నేత అన్నారు.

తీర్పు రాగానే కెసిఆర్ దాన్ని గౌరవిస్తామని ప్రకటన చేయడం వలన వాళ్ళ పరువు దక్కినా అసలు ఆ పరిస్తితి ఎందుకు తెచ్చుకోవాలి? అని అయన ప్రశ్నించారు. విభజన చట్టంలో 101 వ సెక్షన్ ఇందుకోసమేనా? అని ఒక విశ్లేషకుడు ప్రశ్నించారు. అనుకులతలో అపశ్రుతి అంటే ఇదేనని మరో తెరాస నేత అన్నారు. నీరసపడిన కాంగ్రెస్ నేతల నోరు పెగలడానికి కోర్ట్ ఉత్తర్వు కారణం కాలేదా? అని ప్రశ్నించారు. నిజంగా ప్రతిపక్షాలకు బలం ఉంటే ఎన్నికల ప్రక్రియను ఎందుకు వెనక్కు పంపిస్తున్నాయని అయన వ్యాఖ్యానించారు.

ఈ ఎదురు దెబ్బతో తమకు కాస్త ఊరట దొరుకుతుందని ప్రతిపక్షాలు ఆశపడుతుంటే, తమ గెలుపునకు డోకా లేదని తెరాస చెబుతున్నది. ఒంటరిగా మెజారిటీ రాకపోతే మజ్లిస్ తో సంప్రదిస్తామని కేటిఅర్ ఒక టీవీ చర్చలో స్పష్టంగానే చెప్పేసారు. మజ్లిస్ పై ఎలాగు ఈ ప్రభావాలు పనిచేయవు. కనుక మా విజయానికి ఇబ్బంది లేదు. రాజకీయ విమర్సల గురించి మాత్రమే దీని ప్రభావం అని తెరాస బల్లగుద్ది చెబుతున్నది. అయితే ఈ ఆదేశం తమకు అనుకూలంగా మలుచుకోగలమనే ఆశ ఇతరుల్లో కనిపిసున్నది. చివరికి ఓటర్లు తీర్పు కోసం చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిన్న జీయర్ స్వామి చరిత్రను వక్రీకరిస్తున్నారా?

ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులే. అయితే ఈ దాడుల నేపథ్యంలో చిన్న జీయర్ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా ఇవాళ ఆదోనిలో...

‘గ‌ని’గా వ‌రుణ్ తేజ్‌

`ఫిదా`, `తొలి ప్రేమ‌`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌` ఇలా వ‌రుస హిట్ల‌తో చెల‌రేగిపోతున్నాడు వ‌రుణ్ తేజ్‌. ఇప్పుడు బాక్స‌ర్ అవ‌తారం ఎత్తుతున్నాడు. కిర‌ణ్ కొర్ర‌పాటి అనే ద‌ర్శ‌కుడితో వ‌రుణ్ ఓ సినిమా...

శంక‌ర్ తెలుగు సినిమా.. అయ్యే ప‌నేనా?

భార‌తీయ ద‌ర్శ‌కుల‌లో శంక‌ర్ ది విభిన్న‌మైన శైలి. రెండు మూడేళ్ల‌కు ఒక సినిమానే తీస్తుంటాడు. అందులో త‌న ప్ర‌త్యేక‌త‌లు ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌తాడు. శంక‌ర్ ఏం చేసినా భారీగానే ఉంటుంది. భారీ...

ఖమ్మం పంచాయతీ తీర్చేందుకు సిద్ధమైన కేటీఆర్..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతోంది. ప్రముఖలనదగ్గ నేతలందరూ టీఆర్ఎస్‌లోనే ఉన్నారు. వారి కోసం ఇతర పార్టీలు వలలేస్తున్నాయి. ప్రాధాన్యం దక్కకపోతే.. ఆ ప్రముఖ నేతలూ పార్టీలో ఉండే అవకాశం లేదు....

HOT NEWS

[X] Close
[X] Close