కాంగ్రెస్ లో క‌ల‌హాలే ఉప ఎన్నిక‌ల్లో తెరాస‌కు బ‌ల‌మౌతుందా..?

పీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సొంత నియోజ‌క వ‌ర్గం హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక తేదీ ఖరారైంది. అక్టోబ‌ర్ 21న ఎన్నిక జ‌రుగుతుంది. మూడ్రోజుల్లోనే అంటే, 24న ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తామ‌ని సీఈవో ర‌జ‌త్ కుమార్ షెడ్యూల్ ని ప్ర‌క‌టించారు. ఈ నెల 23 నుంచి ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ తెరాస నుంచి సైదిరెడ్డిని అభ్య‌ర్థిగా మ‌రోసారి ఎంపిక చేశారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీద స్వ‌ల్ప ఓట్ల తేడాలో ఆయ‌న ఓడిపోయారు. ఈసారి కూడా సైదిరెడ్డికే అవ‌కాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈ ఉప ఎన్నిక‌ల బాధ్య‌త‌ల్ని మంత్రి హ‌రీష్ రావుకి అప్ప‌గిస్తార‌ని మొద‌ట్నుంచీ అంద‌రూ అనుకున్నా… మ‌రో మంత్రి జ‌గ‌దీష్ కి ఈ వ్య‌వ‌హారాల‌ను సీఎం అప్ప‌గించిన‌ట్టు స‌మాచారం. అవ‌స‌ర‌మైతే మ‌రికొంద‌రు మంత్రులు, చుట్టుప‌క్క‌ల నియోజ‌క వ‌ర్గాల ఎమ్మెల్యేలు ఆయ‌న‌కి స‌హాయం చేయాల్సి ఉంటుంద‌ని సీఎం చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి ఉత్త‌మ్ స‌తీమ‌ణి ప‌ద్మావతి బ‌రిలోకి దిగుతున్న‌ట్టు ఆ పార్టీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ప్ర‌క‌ట‌న అధికారికంగా ఇంకా వెలువ‌డ‌లేదు. ప‌ద్మావ‌తి అభ్య‌ర్థిత్వంపై ఎంపీ రేవంత్ రెడ్డి విభేదించారు. ఆ పంచాయితీ మ‌రో ప‌క్క అలానే ఉంది. అయితే, ఉత్త‌మ్ కి మ‌ద్ద‌తుగా జానారెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిలు జిల్లాలో ఏక‌మ‌య్యారు. రేవంత్ అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని హైక‌మాండ్ కి కూడా చెప్పిన‌ట్టు స‌మాచారం. పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని కాద‌ని ప‌ద్మావ‌తిని కొన‌సాగిస్తారో, ఈ విష‌యంలో రేవంత్ రెడ్డిని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేస్తారో ఇంకా తేలాల్సి ఉంది.

కాంగ్రెస్ లో నెల‌కొన్న ఈ క‌ల‌హాలే ఇప్పుడు తెరాస‌కు క‌లిసి వ‌చ్చే అంశంగా క‌నిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో ఈ లొల్లి మీద‌నే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సైదిరెడ్డితో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. వెంట‌నే, ప్ర‌చారం ప్రారంభించాల‌నీ, కాంగ్రెస్ పార్టీలోని ప‌రిస్థితిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సూచించిన‌ట్టు చెబుతున్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి కాబ‌ట్టి, వారి ప్ర‌చారం కూడా ఒక ప్ర‌ణాళికాబ‌ద్ధంగా సాగే అవ‌కాశం ఉండ‌ద‌నీ, ఈ ప‌రిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవాల‌ని ఇత‌ర నేత‌ల‌కు కూడా సూచించార‌ట‌! మొత్తానికి, కాంగ్రెస్ ఇంటి పోరును హైలెట్ చేసే ప్ర‌య‌త్నంలో తెరాస ఉంద‌నేది అర్థ‌మౌతోంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటుందా, లేదంటే అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తోనే కాల‌యాప‌న చేస్తుందా అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close