వరంగల్ రివ్యూ : అభ్యర్థులు ఖరారయ్యాక పిక్చర్ క్లారిటీ వచ్చినట్లేనా..?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తిరమైన రాజకీయం నడుస్తోంది. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌లకు కంచుకోటగా ఉన్న జిల్లాలో మళ్లీ పునర్వైభవం కోసం ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఉద్యమ సమయలో సీట్లు పెంచుకున్న టీఆర్‌ఎస్‌ అదే దూకుడును కొనసాగించాలనుకుంటోంది. మరోవైపు ఉనికి కాపాడుకునేందుకు బీజేపీ ఆరాటపడుతుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో 8 సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. రెండు చోట్ల టీడీపీ, ఒకటి కాంగ్రెస్‌, ఒకటి స్వతంతర్య అభ్యర్ధి గెలిచారు. అయితే ఆ తరువాత టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌తో టీఆర్‌ఎస్‌ బలం 11కు పెరిగింది. రాష్ట్రంలో గెలిచిన ఏకైక ఇండిపెండెంట్‌ దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ప్రజాకూటమి తరపున టీడీపీ ఒక స్థానంలో, టీజేఎస్‌ రెండు చోట్ల, తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తున్నాయి.

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌ను చివరి నిమిషంలో ప్రకటించారు. దీంతో అసంతృప్తుల సంఖ్య పెరిగింది. కేటీఆర్‌ చొరవ తీసుకోవడంతో సద్దుమణిగినట్టు కనిపించినా… అది పైపైకే. ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీకి గిఫ్ట్‌గా ఇస్తామని కొండా దంపతులు సవాల్‌ విసిరారు. ప్రజాకూటమి నుంచి టీజేఎస్‌ అభ్యర్ధి గాదె ఇన్నయ్య బరిలో ఉండగా. ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ అంటూ వద్దిరాజు రవిచంద్రకు కొండా దంపతులు బీఫాం ఇప్పించారు. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో పదిహేనేళ్లుగా టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడుతూనే ఉంది. అదే జోష్‌తో ఆ పార్టీ నుంచి దాస్యం వినయ్‌భాస్కర్‌ బరిలో దిగారు. ప్రజాకూటమి అభ్యర్ధిగా టీడీపీ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి బరిలో ఉన్నారు. వరంగల్‌ అర్బన్‌లో టీడీపీకి పెద్దగా బలం లేకపోవడం, కాంగ్రెస్‌ క్యాడర్‌ టీడీపీతో కలిసి పనిచేయడానికి ముందుకురాకపోవడం రేవూరి మైనస్‌గా మారనుంది. బీజేపీ అభ్యర్థి ఉన్నా..ప్రభావం అంతంతమాత్రమే.

వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి ఆరూరి రమేష్‌, ప్రజాకూటమి అభ్యర్ధిగా దేవయ్య, బీజేపీ నుంచి సారంగరావు పోటీలో ఉన్నారు. చివరి నిమిషం వరకు కూటమి టిక్కెట్ల వ్యవహారం తేలకపోవడంతో దేవయ్య ప్రచారం ఆలస్యంగా మొదలుపెట్టారు. దీంతో కొందరు మండల స్థాయి నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇది కొంత ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక స్థానిక కాంగ్రెస్‌ నేతలు కూడా దేవయ్య కంటే రమేష్‌ వైపే మొగ్గుచూపుతున్నారనే ప్రచారం ఉంది. భూపాలపల్లిలో చతుర్ముఖ పోటీ ఉంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీతో పాటు ఫార్వార్డ్‌ బ్లాక్‌ అభ్యర్ధి నువ్వా నేనా అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న స్పీకర్ మధుసూదనా చారి.. కొడుకులు కారణంగా కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

ప్రజాకూటమి అభ్యర్ధిగా రంగంలో ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి తనకు ఉన్న పట్టతో గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అభ్యర్ధి కీర్తిరెడ్డి కూడా మూడేళ్లుగా నియోజకవర్గంలోనే పనిచేస్తున్నారు. పార్టీ క్యాడర్‌తో పాటు ఓ వర్గం ఓటు బ్యాంక్‌ కలిసొస్తుందని ఆమె ధీమాగా ఉన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గండ్ర సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఈయనకు బలమైన ఓటు బ్యాంక్‌ ఉంది. దీంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ తీవ్రంగా కనిపిస్తుంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆసక్తి రేపుతోన్న నియోజకవర్గం పరకాల. ఇక్కడ ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ఉంది. టీఆర్‌ఎస్‌ నుంచి చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కొండా సురేఖ పోటీ చేస్తున్నారు. కొండా దంపతులు తమ పాత నియోజకవర్గంగా చెప్పుకునే పరకాలలో మహిళల ఓట్లపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులెంతమంది, ఎక్కడ నెగిటివ్‌గా ఉందనేది సర్వే చేసుకుని మరీ అభ్యర్ధులు ప్రచారాలు చేస్తున్నారు. ములుగు నియోజకవర్గంలో ప్రధాన పోటీ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్యనే ఉండనుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి అజ్మీరా చందూలాల్‌పై సొంత పార్టీలోనే మొదట్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సీతక్క ప్రజాసమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. సీతక్కకు అడ్వాంటేజ్ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ హాస్పిటల్ తరఫున హీరో రామ్ వకాల్తా, సోనూసూద్ ని చూసి నేర్చుకోమంటున్న నెటిజన్లు

హీరో రామ్ పోతినేని, "ఇది స్వాతంత్ర దినోత్సవమా లేక స్వర్ణా ప్యాలెస్ సంఘటనకు సంబంధించిన దినమా" అంటూ ప్రశ్నించడమే కాకుండా ఈ ఘటన విషయంలో ముఖ్యమంత్రి జగన్ ని అప్రతిష్టపాలు చేసే కుట్ర...

రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి : జగన్

రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... ప్రసంగించారు. ఈ సందర్భంగా...
video

మ‌రో అవార్డు ఖాయ‌మా కీర్తి.??

https://youtu.be/rjBv3K5FMoU మ‌హాన‌టితో జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. ఆ అవార్డుకి కీర్తి అర్హురాలు కూడా. అప్ప‌టి నుంచీ.. ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటోంది. అందులో భాగంగా కీర్తి న‌టించిన మ‌రో...

కోలుకుంటున్న బాలు

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం క్షీణించింద‌న్న వార్త‌లు రావ‌డంతో.. యావ‌త్ చిత్ర‌సీమ ఉలిక్కిప‌డింది. ఆయ‌న ఆరోగ్యం బాగుండాల‌ని, క్షేమంగా తిరిగిరావాల‌ని అభిమానులంతా ప్రార్థించారు. ఆ ప్రార్థ‌న‌లు ఫ‌లిస్తున్నాయి. బాలు ఆరోగ్యం క్ర‌మంగా...

HOT NEWS

[X] Close
[X] Close