ఎవరేం చెబుతున్నా… తనకు మాత్రం అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే వినిపిస్తూన్న మాట. అందుకోసం మిత్ర దేశాల ప్రయోజనాలను అడ్డుకునేందుకు కూడా సిద్దమేనని తాజాగా స్పష్టం చేశారు. భారత ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడు అని, ఇండియాతో ఫ్రెండ్లీగా ఉంటామని చెప్తూ తాను చేసేది చేసేస్తున్నారు ట్రంప్.
యాపిల్ తయారీ ప్లాంట్లను ఇండియాకు తరలించేందుకు ఆ కంపెనీ రెడీ అవ్వగా.. అందుకు నిరాకరించారు ట్రంప్. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. అమెరికా – చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతుండటంతో యాపిల్ సంస్థ అక్కడ ఏర్పాటు చేయాలనుకున్న ప్లాంట్లను ఇండియాలో ఏర్పాటు చేయాలని భావించింది. అమెరికాకు అవసరమైన ఐఫోన్లను ఇండియాలో తయారు చేసి ఎక్స్ పోర్ట్ చేయాలని ప్లాన్ చేశారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందని సంబరపడుతుండగా ట్రంప్ ఇండియాకు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు.
యాపిక్ తయారీ ప్లాంట్లు మన దేశానికి తరలివస్తాయన్న ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్ తో ఖాతర్ లో భేటీ అయిన ట్రంప్.. ఆ కంపెనీ ప్లాంట్లు భారత్ కు తరలించవద్దని చెప్పగా.. ఇందుకు ఆయన కూడా అంగీకరించాని వెల్లడించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ కూడా అధిక టారిఫ్ లు విధిస్తోందని అందుకే యాపిల్ కంపెనీని అడ్డుకున్నానని ట్రంప్ తాజాగా చెప్పారు. మొత్తానికి భారత్ తో సన్నిహితంగా ఉంటామని, తమ దోస్త్ అంటూనే ఇండియాకు ట్రంప్ ద్రోహం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.