ట్రంప్ అసలు టార్గెట్ ఇరాన్ కాదు గల్ఫ్. ఒకప్పుడు ఆయిల్ మాత్రమే ఆర్థిక వనరు అయిన గల్ఫ్ ఇటీవలి కాలంలో ఆయిల్ నుంచి సంపాదించుకుని పెద్ద ఎత్తున ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలుగా ఎదురుగుతున్నాయి. అందుకే ట్రంప్ కన్ను కుట్టినట్లుగా ఉంది. మిత్రదేశాలపై నేరుగా దాడులు చేయలేరు కాబట్టి ఇరాన్ పై ఇజ్రాయెల్ తో ఆ దేశంపై దాడి చేయించి ఇరాన్ ను రెచ్చగొట్టి గల్ఫ్ పై దాడుు చేయిస్తున్నారు. తాము గల్ఫ్ దేశాలు.. ఇరుగు పొరుగు దేశాలపై దాడి చేయబోమని ఇరాన్ చెప్పిన తర్వాత… ఆదేశాల్లో ఆయిల్ డిపోలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఆ తర్వాత ఇరాన్ మరింత దూకుడుగా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్నాయి. ఇది కుట్ర కాక మరేమిటి?
గల్ఫ్ దేశాలను ఆర్థికంగా నిర్వీర్యం చేసే ప్రణాళిక
పశ్చిమాసియాలో ప్రస్తుత ఉద్రిక్తతలు కేవలం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుగా మాత్రమే కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాశ్చాత్య శక్తుల లోతైన ఆర్థిక వ్యూహం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒకప్పుడు కేవలం చమురు నిల్వలకే పరిమితమైన గల్ఫ్ దేశాలు, నేడు తమ సంపదను పర్యాటకం, టెక్నాలజీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మళ్లించి ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్నాయి. ఈ ఎదుగుదల అమెరికా ఏకఛత్రాధిపత్యానికి సవాలుగా మారుతుండటంతో, గల్ఫ్ దేశాల ఆర్థిక పునాదులను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇరాన్ను ఒక పావుగా వాడుకుంటున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
గల్ఫ్ కు రక్షణ ఇవ్వని అమెరికా
నేరుగా మిత్రదేశాలైన గల్ఫ్ రాజ్యాలపై అమెరికా దాడులు చేయడం సాధ్యం కాదు కాబట్టి, ఇరాన్ను ఉసిగొల్పడం ద్వారా పరోక్షంగా ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టించే కుట్ర జరుగుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్ కీలక స్థావరాలపై దాడులు చేయించడం, తద్వారా ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగేలా ప్రేరేపించడం ఇందులో భాగమే. తాము పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ, అనుమానాస్పద రీతిలో ఇరాన్ చమురు డిపోలపై దాడులు చేశారు. ఫలితంగా ఇరాన్.. గల్ఫ్ ఆయిల్ సామ్రాజ్యాన్ని కుప్ప కూలుస్తామని పంతం పట్టింది. అదే సమయంలో ఇజ్రాయెల్ కోసం మాత్రమే అమెరికా రక్షణ వ్యవస్థలు పని చేస్తున్నాయి. గల్ఫ్ దేశాలను పట్టించుకోవడంలేదని లేదు.
గల్ఫ్ దేశాల అభివృద్ధిని ఆపేయడమే ట్రంప్ లక్ష్యం?
గల్ఫ్ దేశాల చమురు ఉత్పత్తి నిలిచిపోతే లేదా అక్కడి మౌలిక సదుపాయాలు ధ్వంసమైతే, ప్రపంచ మార్కెట్ కుప్పకూలుతుంది. అప్పుడు సహజంగానే పెట్టుబడులు మళ్లీ సురక్షితమైన పాశ్చాత్య దేశాలకు మళ్లుతాయి. అంటే, గల్ఫ్ దేశాలు నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూల్చి, వారిని మళ్లీ రక్షణ కోసం తమపై ఆధారపడేలా చేయడం ట్రంప్ మార్క్ విదేశాంగ విధానంలో అంతర్లీనంగా ఉన్న అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది కేవలం సరిహద్దు పోరాటం కాదు, ఒక పక్కాగా రూపొందించిన ఆర్థిక యుద్ధం అని అర్థమవుతోంది. యుద్ధ మేఘాల చాటున గల్ఫ్ దేశాల అపార సంపదను, వారి ఎదుగుదలను నియంత్రించడమే ప్రధాన అజెండాగా సాగుతున్న ఈ కుట్ర, భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీ కుదుపునకు గురిచేసే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ చదరంగంలో మధ్యప్రాచ్య దేశాలు బలిపశువులు కాకుండా ఉండాలంటే, ఆ ప్రాంత దేశాలన్నీ విభేదాలను పక్కన పెట్టి ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది.


