సోమవారం కర్ణాటకం పార్ట్ -2

యడ్యూరప్పగా కలిసి రాలేదని.. యడియూరప్పగా పేరు మార్చుకుని.. బీజేపీ నేత .. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నాలుగో సారి సీఎం అయ్యారు. అయితే. . అంతకు ముందు మూడు సార్లూ కలిపి ఆయన ఐదేళ్లు అధికారం చెలాయించలేకపోయారు. నాలుగోసారి అవకాశం లేదు. ఇక నుంచి పూర్తిగా ఉన్నా… అది నాలుగేళ్ల లోపే అవుతుంది. అయితే పూర్తి కాలం ఉంటారా.. అంటే.. అంత తేలికగా రాజకీయం లేదన్న అభిప్రాయం కర్ణాటకలో జోరుగా వినిపిస్తోంది. కర్ణాటకలో ఏ రోజు ఎవరు ఎటు మారతారో తెలియని పరిస్థితి. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పిన అత్యున్నత న్యాయస్థానం, సభకు హాజరు కావాలా వద్దా అన్నది వారి ఇష్టానికే వదలేసింది. ఇప్పటి వరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే అమలులో ఉన్నాయి.

విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టు తుది తీర్పు కీలకం కాబోతోంది. స్పీకర్ రమేష్ కుమార్ ఇప్పటికే ముగ్గురు రెబెల్స్‌ను అనర్హులుగా ప్రకటించారు. మరో 15 మంది భవితవ్యం ఆయన చేతుల్లో ఉంది. పార్టీలకు విప్ అధికారం ఉంటుందని… సుప్రీం కోర్టు తన తుది తీర్పులో ప్రకటిస్తే… మిగతా రెబెల్స్ రాజకీయ జీవితంపై తెర పడినట్లే. అప్పుడు ఎమ్మెల్యేలు కాకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలన్న వాళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్లవుతంది. యడియూరప్ప ప్రభుత్వం బల నిరూపణ పూర్తయ్యే వరకు తాము బెంగళూరు దరిదాపులకు రాబోమని, ముంబైలోనే ఉంటామని రెబెల్స్.. అమిత్ షాకు హామీ ఇచ్చారు. దానితో అంతా సవ్యంగానే జరుగుతుందని అమిత్ షా నమ్మి… యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి అనుమతి ఇచ్చారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత కర్ణాటక అసెంబ్లీ బలం 221కి పడిపోయింది. బల నిరూపణ జరిగితే 111 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. బీజేపీకి 105 మంది సభ్యులున్నారు.

రెండు పార్టీల మధ్య ఉన్న ఐదు ఓట్ల తేడా ఏ క్షణమైనా మారవచ్చని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంది. కాంగ్రెస్ అసంతృప్తుల్ని ఎలా బీజేపీ చేరదీసిందో.. బీజేపీ అసంతృప్తుల్ని అలా చేరదీయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. అనర్హతా వేటో.. రాజీనామాలు ఆమోదించడమో.. ఏదో ఒకటి.. ఎమ్మెల్యే స్థానాలు మాత్రం ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని కూడా కాంగ్రెస్ – జేడీఎస్ ఆశిస్తోంది. ఖాళీ అయిన స్థానాల్లో జరిగే ఎన్నికల్లో తమ సంకీర్ణం విజయం సాధించగలిగితే… యడియూరప్ప సర్కారు మళ్లీ మైనార్టీలో పడిపోతుంది. అప్పుడు పూర్తి కాలం పదవిలో ఉండకుండానే యడియూరప్పను దింపేయవచ్చు. మళ్లీ తమ సంకీర్ణం అధికారంలోకి రావచ్చని కాంగ్రెస్ – జేడీఎస్ ఇప్పుడు వ్యూహరచన చేస్తున్నాయి. మొత్తానికి కర్ణాటకం ముగిసే అవకాశం లేదని.. పార్ట్ -2 మాత్రమే ఉంటుందని.. ఇప్పటికైతే క్లారిటీగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close