మొన్నామధ్య సుబ్బరామిరెడ్డి మైకు పట్టుకొని చిరు, పవన్, చరణ్, బన్నీలతో సినిమా చేస్తా… అనగానే అంతా `ఇది మైకుల మాటేలే` అనుకొన్నారు. వారం గడిచిందో లేదో చేసి చూపించాడు సుబ్బరామిరెడ్డి. చిరు, పవన్ ఇద్దరితో కలసి ఓ సినిమా చేస్తున్నా.. అంటూ అఫీషియల్‌గా ఓ ప్రకటన విడుదల చేశాడు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్‌కి అప్పగించాడు. ఇది కేవలం పేపర్ కి మాత్రమే పరిమితయ్యే వార్త కూడా కాదాయె. ఎందుకంటే…. ఈరోజే పవన్‌ని, త్రివిక్రమ్నీ కలసిన సుబ్బరామిరెడ్డి వాళ్లిద్దరి నుంచీ మాట తీసుకొన్న తరవాతే… ఈ కాంబినేషన్‌పై ఓ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ప్రకటించాడు. గత వారం రోజుల నుంచీ.. చిరంజీవిని ఒప్పించే ప్రయత్నంలో తిరిగి తిరిగీ, అందులో దిగ్విజయం సాధించిన సుబ్బరామిరెడ్డి, గత రెండ్రోజుల నుంచీ.. పవన్, త్రివిక్రమ్‌తో మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజే దిల్లీ నుంచి వచ్చిన సుబ్బరామిరెడ్డి వస్తూ వస్తూ పవన్నీ, త్రివిక్రమ్నీ కలసి ఫైనల్‌గా ఈ సినిమా గురించి ఓ ప్రకటన విడుదల చేశాడు. ఈ చిత్రానికి అశ్వనీదత్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. చిరు ప్రస్తుతం 151వ సినిమాతో బిజీగా ఉన్నాడు. 152వ చిత్రంగా సెట్‌కి వెళ్లే అవకాశం ఉంది.