తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు కుటుంబంపై సోమవారం తిరుపతిలో జరిగిన దాడి అంశం సీరియస్ అంశంగా మారుతోంది. సోమవారం ఉదయం తిరుచానూరు సమీపంలోని ఒక హోటల్లో బి.ఆర్. నాయుడు తన కుటుంబంతో కలిసి అల్పాహారం తీసుకుంటున్న సమయంలో నిరసనల ముసుగులో వచ్చిన కొంత మంది దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో హోటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తక్షణమే స్పందించి నిరసనకారులను అడ్డుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
వచ్చిన వారంతా భూమన అనుచరులు. కొన్ని ప్రాంతాల నుంచి మహిళల్ని తీసుకు వచ్చారు. ఇదంతా భూమన కరుణాకర్ రెడ్డి,ఆయన కుమారుడి కనుసన్నల్లో జరిగింది. తిరుపతిలో అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడంలో భూమన కరుణాకర్ రెడ్డి ముందుంటున్నారు. ఈ దాడి ఘటనపై తెలుగుదేశం , జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో స్పందించారు. గత కొద్ది రోజులుగా బి.ఆర్. నాయుడు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని వీడియోలను ప్రచారంలోకి తెచ్చిన భూమన వర్గం, ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులకు దిగుతున్నారని విమర్శఇంచారు.
రాజకీయ కక్షతోనే నిరసనల పేరుతో రౌడీ మూకలను పంపి, టీటీడీ చైర్మన్ కుటుంబంపై రాళ్లతో దాడి చేయించారని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ నైతిక విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తాము శాంతియుత నిరసన చేపట్టామని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. తమ మహిళా కార్యకర్తలు నిరసన తెలుపుతుంటే, టీడీపీ కార్యకర్తలే తిరిగి తమపై దాడులకు పాల్పడ్డారని, ఈ క్రమంలో పలువురు మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయని రివర్స్ రాజకీయం చేస్తున్నారు. ఈ లఘటనపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో సుమారు 10 మందికి పైగా భూమన అనుచరులైన కేసులు నమోదయ్యాయి.
భూమన కరుణాకర్ రెడ్డి పూర్తిగా కంట్రోల్ తప్పి పోయారు. టీటీడీలో చేసిన అప్పులన్నీ బయటకు వస్తూండటంతో టీటీడీ చైర్మన్ ను ఆయన టార్గెట్ చేశారు. కానీ ఎప్పటికప్పుడు అన్నీ రివర్స్ అవుతూండటంతో చివరికి ఆయనను భయపెట్టేందుకు దాడులకు పులికొల్పుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. భూమన పూర్తిగా దారి తప్పారని అది ఆయన పతనం సూచిక అని.. తిరుపతిలో చర్చించుకుంటున్నారు.

