శేఖర్ రెడ్డికీ క్లీన్ చిట్..! ఇక టీటీడీ బోర్డులోకి తీసుకోబోతున్నారా..?

శేఖర్ రెడ్డి. ఈ పేరు.. ఏపీ ప్రజలకే కాదు.. దేశం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే నోట్లను రద్దు చేసినప్పుడు.. ప్రజలంతా.. చెల్లుబాటయ్యే నోటు ఒక్కటంటే.. ఒక్కదాని కోసం.. ఏటీఎంల ముందు… రోజంతా పడిగాపులు పడుతున్న సమయంలో… ఈ శేఖర్ రెడ్డి ఇంట్లో.. కోట్లకు కోట్ల కొత్త నగదు పట్టుబడింది. ఏటీఎంలలో పెట్టడానికి నగదే లేదని ఆర్బీఐ అంటోన్న సమయంలోనే… అంతకు మించిన నిధి.. ఆయన ఇంట్లో దొరికింది. అందుకే.. అప్పుడు ఆయన.. దేశం మొత్తం హాట్ ఫేవరేట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆయనకు… క్లీన్ చిట్ వచ్చేసింది.

ఆ సొమ్మంతా వ్యాపార లావాదేవీల్లోనిదట..!

నోట్లు రద్దు చేసిన సమయంలో రూ.34కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్ల కట్టలు దొరికిన పారిశ్రామికవేత్త శేఖర్‌రెడ్డి. అప్పట్లో ఒక్క నోటు కోసం, బ్యాంకుల ముందు బారులు తీరి, లాఠీ దెబ్బలు మన లాంటి సామాన్యులు పడితే, ఇలాంటి వారి దగ్గర మాత్రం ఏకంగా రూ. 34 కోట్లు కొత్త నోట్లు దొరికాయి. అప్పట్లో ఇది ఒక సంచలనం అయ్యింది. ఆ టైంలో శేఖర్‌రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఈ డబ్బు అంతా చంద్రబాబుది అని, శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అంటూ బీజేపీ, వైసీపీ విమర్శలు చేశాయి. పవన్ కల్యాణ్.. ఈ శేఖర్ రెడ్డికి.. లోకేష్‌కు కూడా లింక్ పెట్టారు. ఇప్పుడు.. ఆయనకు.. ఆ సొమ్మంతా.. వ్యాపారవాదేవీల్లో వచ్చిందని.. ఐటీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది. సీబీఐ పెట్టిన కేసులు.. గతంలోనే… సమర్థమైన వాదనలు వినిపించకపోవడంతో.. కోర్టు కొట్టి వేసింది.

ఆ సమయంలో అంత సొమ్ము ఎవరిచ్చారో కనిపెట్టలేకపోయారా..?

రాజకీయ బలం ఉన్న వారు.. అవినీతి కేసుల నుంచి ఈజీగా బయటపడగలరు. అది చరిత్రే కాదు..వర్తమానం కూడా. కానీ ఇక్కడ శేఖర్ రెడ్డి వద్ద దొరికిన ఆ డబ్బు ఆయన కష్టపడి సంపాదించాడా లేడా అని కాదు. ఒక్క రెండు వేల రూపాయి కాగితం కోసం ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో, శేఖర్ రెడ్డికి, 34 కోట్లకు, రెండు వేల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి అని ? కేంద్రంలో పెద్దల సాయం లేనిదే అంత డబ్బు రాదు. మరి, ఈ విషయం తేల్చకుండా, అది సక్రమ సంపాదన అని తేల్చేశారు. అసలు దొంగల్ని మాత్రం.. దాచేశారు. ఇప్పుడు.. నోట్లు లభిస్తున్నాయి కాబట్టి.. అసలు వ్యవహారం సద్దుమణిగిపోయింది. కానీ దీని వెనుక ఉన్న అసలు పెద్దలు.. తప్పించుకున్నారు. వారిని తప్పించడం కోసం .. శేఖర్ రెడ్డినీ తప్పించారనేది.. చాలా మంది అభిప్రాయం.

న్యాయం చేయాలని ఏపీ సర్కార్‌కు.. శేఖర్ రెడ్డి దరఖాస్తు..!

ఓ వైపు … టీటీడీ చైర్మన్ ను జగన్ నియమించారు. సభ్యులను పదిరోజుల్లోనూ నియమిస్తామని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్ రావడం… యాధృచ్చికం. అంతే కాదు.. అలా వచ్చిన వెంటనే.. ఆయన ఏపీ సర్కార్‌కు ఓ వినతి పత్రం పంపారు. తనను అన్యాయంగా టీటీడీ బోర్డు మెంబర్ పదవి నుంచి తొలగించాలని.. తనకు మళ్లీ మెంబర్ పదవి ఇవ్వాలనేది.. ఆ వినతి పత్రం సారాంశం. అలా ఇవ్వడానికే.. ఆయనకు క్లీన్ చిట్‌లు వచ్చాయనేది.. జరుగుతున్న ప్రచారం . అదే జరిగితే.. మళ్లీ శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబరైపోయినట్లే.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close