తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత రాజకీయాలు మాట్లాడిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే, జగన్ రెడ్డి బంధువు రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ విజిలెన్స్ కేసు నమోదు చేసింది. టీటీడీ బోర్డు ఇటీవల తిరుమలలో రాజకీయాలను మాట్లాడటాన్ని నిషేధిస్తూ తీర్మానం చేసింది. ఆ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కేసులు పెట్టాలని నిర్ణయించింది. అయినప్పటికీ రవీంధ్రనాథ్ శ్రీవారి దర్శనం చేసుకుని రాజకీయాలు మాట్లాడారు.
ఆయన మాటలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీంతో టీటీడీ సీరియస్ గా తీసుకుంది. లీగల్ ఒపీనియర్ తీసుకుని రవీంధ్రనాథ్ రెడ్డిపై కేసులు పెట్టింది. అంతకు ముందే సీపీఐ నేత నారాయణ కూడా తిరుమలలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. సంబంధం లేని ధర్మస్థల ఆలయంపై ఆరోపణలు చేశారు. ఆయనపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది. పైగా ఆయన తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం రాలేదు. ఓ పెళ్లికి వచ్చారు. కమ్యూనిస్టు అయిన ఆయన శ్రీవారి దర్శనం చేసుకోరు.
రోజా కూడా వారం, పది రోజులకోసారి దర్శనం చేసుకోవడానికి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరందరిని కంట్రోల్ లో ఉంచాలంటే.. అలా మాట్లాడేవారిపై కేసులు నమోదు చేయడమే కరెక్టని భక్తులు అంటున్నారు. అయితే అసలు మీడియాను అనుమతించడం, వారు మైకులు పెట్టడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని మీడియా పాయింట్.. బస్టాండ్ దాటిన తర్వాత పెడితే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.