పాకిస్తాన్ కు టర్కీ సాయం చేసింది. తాము పాకిస్తాన్ కు అండగా ఉంటామని.. ప్రకటించింది. సైనిక సాయం, డ్రోన్లు, మిస్సైళ్లను పంపుతామని చెప్పింది. ఇప్పుడే కాదు.. ఇక ముందు కూడా సాయం చేస్తామని చెప్పింది. పాకిస్తాన్ పై ఈ ప్రేమ టర్కీకి ఎందుకు వచ్చిందన్నది చాలా మందికి అర్థం కాని విషయం. టర్కీతో భారత్ కు గొడవల్లేవు. భారత్ పై ద్వేషంతో పాకిస్తాన్ కు సాయం చేయడం లేదు. టర్కీ ప్లాన్ టర్కీకి ఉంది.
టర్కీ కూడా ఇస్లామిక్ దేశం. ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఆశలు భిన్నం. ఆయన ఇస్లామిక్ దేశాలన్నింటికీ నాయకత్వం వహించాలని అనుకుంటున్నారు. ఇస్లామిక్ దేశాలకు తామే పెద్ద అన్నట్లుగా అనిపించుకోవాలని ఉబలాటపడుతున్నారు. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం… ఆ దేశానికి సాయం చేయడం ద్వారా తన గ్రిప్ లో ఉంచుకోవాలనుకుంటోంది. రేపు చైనాపై పాకిస్తాన్ డ్రోన్లు పంపినా టర్కీ ఇస్తుంది. ఇది పాకిస్తాన్ పై ప్రేమ మాత్రమే కాదు.. ఆ దేశాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలన్న స్వార్థం కూడా.
టర్కీ అధ్యక్షుడికి ఉన్న లక్ష్యాలకు పాకిస్తాన్ ఓ టూల్ లాగా ఉపయోగపడుతుందన్న కారణంగానే మద్దతు ఇస్తున్నారు. రేపు పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాల కు సంబంధించి తమ పెద్దరికాన్ని అంగీకరించకపోతే టర్కీ తన సాయంపై ఆలోచించే అవకాశం ఉంది. అరబ్ కాకుండా ఇతర ఇస్లామిక్ దేశాలు ఆర్థికంగా అంత బలంగా లేవు. దీన్ని టర్కీ అధ్యక్షుడు ఓ అవకాశంగా చేసుకుంటున్నారు.