మీడియావాచ్ : టీవీ9 బెంగాలీ రెడీ..!

టీవీ9 గ్రూప్ బెంగాల్‌లో ప్రవేశించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే తెర వెనుక ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని చానల్‌ను ప్రారంభానికి సిద్ధం చేసుకుంది. వచ్చే ఏడాది బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఓ న్యూస్ చానల్ లాంచింగ్‌కు… తనదైన ముద్ర వేయడానికి ఎన్నికల కంటే.. గొప్ప సందర్భం మరొకటి ఉండదు. అందుకే..శరవేగంగా.. సిద్దం చేసి.. ప్రసారాలను ప్రారంభిస్తున్నారు. ఇరవై నాలుగు గంటల న్యూస్ చానల్‌తో పాటు.. బంగ్లాకే ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే టెస్ట్ సిగ్నల్స్ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఈ నెలలలోనే పూర్తి స్తాయి ప్రసారాలు ప్రారంభిస్తారు . టీవీ9 సీఈవో బరున్ దాస్ ఈచానల్‌పై ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు.

తెలుగులో ప్రారంభమైన టీవీ9 ఆ తర్వాత… చాలా వేగంగా విస్తరించింది. వ్యవస్థాపకుడు రవిప్రకాష్.. తెలుగుకే పరిమితం కావాలనుకోలేదు. స్థానిక భాషలన్నింటిలోనూ… చానళ్లను ప్రారంభించి.. భారీ పోటీ ఉన్నప్పటికీ.. తనదైన ముద్రతో.. ప్రముఖ స్థానంలో నిలబెట్టారు. చివరికి హిందీలోనూ అడుగు పెట్టారు. అయితే హిందీలో అడుగు పెట్టేసరికి.. యాజమాన్యం మారిపోయింది. దాంతో ఆయన సంస్థ నుంచి బయటకు పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొత్త యాజమాన్యం గ్రూప్‌లోని కొన్ని చానళ్లను మూసివేయడంతో ఇక విస్తరణ చాన్స్ లేదనుున్నారు . అయితే బెంగాల్‌ విషయంలో మాత్రం ముందడుగు వేశారు.

బెంగాల్‌లో ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీ దూకుడుగా ఉంది. మమతా బెనర్జీని ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ సమయంలో… టీవీ9 నెట్ వర్క్ బీజేపీకి మరింత సపోర్ట్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్త యాజమాన్యం.. టీవీ9 గ్రూప్ ను అధికార పార్టీలకు అనుకూలమైన వార్తలతో నడుపుతోంది. ఈ కారణంగా బెంగాల్‌లో మమతా బెనర్జీ ఎదురీదుతున్నారన్న ప్రచారం నేపధ్యంలో బీజేపీకి అనుకూలంగా ఉండే ఎడిటోరియల్ పాలసీలనే టీవీ9 పాటించే అవకాశం ఉంది. భారీ ఆఫర్లు ఇచ్చి ప్రముఖ జర్నలిస్టుల్ని టీవీ9 గ్రూప్ చేర్చుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీం చెప్పినా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్న వెంకట్రామిరెడ్డి..!

ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి .. ఎస్ఈసీ నిమ్మగడ్డను చంపే హక్కు కూడా ఉందన్నట్లుగా మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తన మాటలు వక్రీకరించారని చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి మరింత వివాదాస్పదమైన...

వ్యాక్సినేషన్ ఉన్నా గుజరాత్‌లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..!

పంచాయతీ ఎన్నికల అంశం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠకు కారణం అవుతోంది. వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో బలంగా వాదించాలని నిర్ణయించుకుంది. ఎన్నికలు జరపాలని అనుకుంటే వ్యాక్సినేషన్...

అప్పట్నుంచి గడ్డం తీసుకోని ఎల్వీ సుబ్రహ్మణ్యం..!

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం హఠాత్తుగా గుంటూరులో కనిపించారు. రామ మందిరానికి విరాళాలు సేకరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గబుక్కున ఆయనను చూసిన వారు చాలా మంది పోల్చుకోలేకపోయారు. ఎవరో స్వామిజీ ప్యాంట్,...

నిమ్మగడ్డ కింకర్తవ్యం..!?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ స్ట్రిక్ట్ ఐఏఎస్ అధికారిగా పని చేసుకుంటూ పోతున్నారు. ఓ రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా తనకు ఉన్న అధికారాలను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సర్వీస్ రూల్స్...

HOT NEWS

[X] Close
[X] Close