మీడియా వాచ్ : సీజేఐ దృష్టికి టీవీ9 “ఫేక్ బ్రేకింగ్” !

అమరావతిపై అసలు సుప్రీంకోర్టులో విచారణ జరగకుండానే హైకోర్టు ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానంలో స్టే వచ్చిందని చెప్పడమే కాకుండా.. అసలు తీర్పులో న్యాయమూర్తులు చెప్పినట్లుగా కొన్ని వాక్యాలను కూడా బ్రేకింగ్ లు వేసి.. ఓ కుట్రపూరిత వార్తా కథనాలను ప్రజల్లోకి పంపిన టీవీ9 పై సీజేఐకి.. ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఏపీ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మినారాయణ టీవీ9 నిర్వాకంపై స్క్రీన్ షాట్లు తీసి…సీజేఐకి ఫిర్యాదు చేశారు.

2023 ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 12.40 గంటలకు, TV9, ఇతర భాషల్లో ఉన్న తెలుగు వార్తా ఛానల్, గౌరవనీయమైన సుప్రీం కోర్టు పేరుతో దుర్మార్గపు ఉద్దేశ్యంతో అబద్ధాలను ప్రసారం చేసిందని లేఖలో గూడపాటి లక్ష్మినారాయణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈ నకిలీని ప్రసారం చేశారు. ప్రజల్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో టీవీ9 న్యూస్ ఛానెల్ అబద్ధాలను వార్తగా ప్రసారం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఉత్తర్వులు జారీ చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ఇచ్చినట్లుగా, ఈ ఛానెల్ గౌరవనీయమైన అపెక్స్ కోర్టు పేరును దుర్వినియోగం చేసిందని లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. అసత్యాలను ప్రసారం చేయడంలో నేరపూరిత కుట్ర కనిపిస్తోందని సీజేఐ దృృష్టికి తీసుకెళ్లారు. అందుకే చానల్ యాజమాన్యంపై సుమోటోగా చర్యలు తీసుకోవాలని కోరారు.

గూడపాటి లక్ష్మి నారాయణ.. ప్రెస్ కౌన్సిల్ కు కూడా ఫిర్యాదు చేశారు. టీవీ9 అది కమ్యూనికేషన్ లోపంతో చేసింది కాదని ఉద్దేశపూర్వకంగా చేసినకుట్ర అని.. అసలు విచారణకు రాకుండానే.. అలాంటి బ్రేకింగ్ వేయడం అనేది.. మామూలుగా కుదరదని.. ఓ రకమైన పానిక్ ను .. ఏపీ ప్రజల్లో సృష్టించడానికి కుట్ర పూరితంగా చేశారని.. అంటున్నారు. ఇలాంటి మీడియా సంస్థలను ఏ మాత్రం క్షమించినా ముందు ముందు కోర్టు తీర్పులు కూడా ముందే ప్రకటించి న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తాయని.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close