మీడియా వాచ్ : టీవీ9లో ఉద్యోగాల విప్లవం

రేటింగ్స్ పడిపోతున్నాయన్న కంగారో లేకపోతే.. ముంచుకొస్తున్న ఎన్నికల కోసం సన్నాహమో తెలియదు కానీ.. టీవీ9లో సీనియర్ జర్నలిస్టులు అందర్నీ రూ. లక్షల జీతాలు ఇచ్చి తీసుకుంటున్నారు. చివరికి సంస్థను వీడి వెళ్లిపోయి ఖాళీగా ఉన్న మురళీకృష్ణను కూడా మళ్లీ తీసుకొచ్చారు. ఇప్పుడు టీవీ 9కు నలుగురు ఔట్ పుట్ ఎడిటర్లు ఉన్నారు. చాలా వరకూ చానళ్లు నలుగురు సబ్ ఎడిటర్లతో బండి లాగించేస్తూంటాయి. కానీ టీవీ9లో మాత్రం పై స్థాయి నుంచి కింది స్థాయి వరకూ ప్రతీ పొజిషన్‌లోని త్రిబుల్ రోల్.. ఫోర్త్ రోల్స్ పెట్టుకున్నారు. ఎవరు ఏం పని చేస్తారో వారికే క్లారిటీ లేకపోతే మొదటికే మోసం వస్తుంది.

ఇలా తీసుకుంటున్న వారందరికీ తక్కువ జీతాలు ఆఫర్ చేయడం లేదు.. కనీసం రూ. లక్ష .. ఆపైనే జీతం ఉంటోంది. సీనియర్ పొజిషన్‌లో ఉన్న వారికి ఇంకా ఎక్కువ. ఇంత భారీ మొత్తంలో జీతాలకు ఖర్చుచేయడానికి .. అవసరం లేకపోయినా పెద్ద ఎత్తున సీనియర్లను రిక్రూట్ చేసుకోవడానికి కారణం ఏమిటన్నది వ్యాపారంలో పండిపోయిన టీవీ9 యజమానులైన రియల్ ఎస్టేట్ మాస్టర్ మైండ్‌లకే తెలియాలి.

గతంలో సాక్షి పత్రిక , చానల్ పెట్టినప్పుడు ఇతర పత్రికలు, చానళ్లలో కీలకంగా పని చేసే… ముఖ్యంగా తమకు వ్యతిరేకంగా వార్తలు వచ్చే సంస్థల్లో కీలకంగా పని చేసే వారిని గుర్తించి.. భారీ ఆఫర్లు ఇచ్చి చేర్చుకునేవారు. ఎన్నికల సమయంలో వారు క్రియాశీలకంగా లేకపోతే చాలన్నట్లుగా .. ఉండేవారు. ఎన్నికలయ్యాక వారందర్నీ అవమానపర్చి వెళ్లిపోయేలా చేసేవారు. ఇప్పుడు కూడా అలాంటి వ్యూహమే అమలు చేస్తున్నారని.. దానికి టీవీ9 వేదికగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం టీవీ9లో సీనియర్ పొజిషన్లలో చేరుతున్న వారిలో టీవీ 5, ఏబీఎన్ లాంటి ప్రో టీడీపీ చానళ్లు.. ఇతర పత్రికల నుంచి చేరేవాే ఎక్కువ ఉన్నారు. అందుకే ఆ వ్యూహం అమలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close