మీడియా వాచ్ : టీఆర్పీల్లో మళ్లీ టీవీ9 నెంబర్ వన్ !

తెలుగు మీడియా చానల్ టీవీ9 టీఆర్పీల్లో మళ్లీ మొదటి స్థానానికి వచ్చింది. యాజమాన్యం మారిన తర్వాత టీవీ9 వెనుకబడిపోయింది. దాదాపు రెండేళ్లుగా ఆ చానల్ రెండో స్థానంలో ఉంది. మరో తెలుగు మీడియా చానల్ ఎన్టీవీ మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది. ఈ వారం వచ్చిన బార్క్ రేటింగుల్లో ఎన్టీవీ కన్నా టీవీ9 ఒక్క పాయింట్ అధికంగా సాధించి మళ్లీ నెంబర్ ప్లేస్‌లో నిలింది.

రెండేళ్ల కిందట కోల్పోయిన తమ నెంబర్ వన్ స్థానం మళ్లీ వచ్చిందన్న ఆనందం టీవీ9 టీమ్‌లో కనిపించింది. కనీసం రెండు గంటల పాటు సంబరాలు చేసుకున్నారు. కేకులు కట్ చేసుకున్నారు. అసలు సాధ్యమయిందో అంరదూ కథలు కథలుగా ప్రేక్షకులకు చెప్పారు. అంతా బాగానే ఉంది ఒకప్పుడు తిరిగులేని పొజిషన్ ఉన్న చానల్ దిగజారిపోయింది కూడా తమ చేతుల్లోనే అని మాత్రం గుర్తు చేసుకోలేకపోయారు.

మొత్తం క్రెడిట్ సహజంగానే రజనీకాంత్ కు కట్టబెట్టారు చాలా మంది. రవి ప్రకాష్ నుంచి ఆయన చేతుల్లోకి చానల్ వెళ్లిన తర్వాత దిగజారిపోయింది.. అల్టిమేట్ స్థానాన్ని కోల్పోయిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్ లు ప్రతీవారం మారిపోతాయి. ఒక్క వారానికే టీవీ9 ఇంత సంబర పడిపోతే వచ్చే వారం రేటింగ్‌లో మళ్లీ టీవీ9 స్థానం పడిపోతే ఎగతాళి చేసే వారికి కొదవ ఉండదు.

ముఖ్యంగా ఎన్టీవీ మళ్లీ ఫస్ట్ వస్తే వాళ్లు ర్యాగింగ్ చేయకుండా ఉంటారా? గతంలో వరుసగా కొన్నాళ్ల పాటు తాము ఫస్ట్ ఉన్నామని ఎన్టీవీ గట్టిగానే ప్రచారం చేసుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ మెన్షన్ !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రిమాండ్ కు తరలించారని.. రిమాండ్ ను కొట్టి వేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం ధర్మాసనం ముందు...

ప్ర‌వీణ్ స‌త్తారు… మిష‌న్ త‌షాఫి!

చంద‌మామ క‌థ‌లు, గ‌రుడ‌వేగ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ఘోస్ట్, గాండీవ‌ధారి అర్జున నిరాశ ప‌రిచాయి. ఇప్పుడు ఆయ‌న‌.. ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అదే.. మిష‌న్ త‌షాఫీ....

ఈవారం బాక్సాఫీస్‌: ముక్కోణ‌పు పోటీ

గ‌త‌వారం బాక్సాఫీసు కొత్త సినిమాల్లేక వెల‌వెల‌పోయింది. `స‌ప్త సాగ‌రాలు దాటి` అనే ఓ డబ్బింగ్ సినిమా వ‌చ్చింది కానీ, ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈసారి... ఏకంగా మూడు క్రేజీ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

ఎల్బీనగర్ కోసమే చంద్రబాబుకు మధుయాష్కీ మద్దతు !

తెలంగాణ సీనియర్ నేత, రాహుల్ కు సన్నిహితుడిగా పేరున్న మధుయాష్కీ ఎల్బీనగర్‌లో పోటీ చేయాలనుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీగా మాత్రమే పోటీ చేసిన మధుయాష్కీ ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు.కానీ నిజామాబాద్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close