పీసీసీ రేస్ : టీవీ9 కష్టం పగవాడికి కూడా రాకూడదు..!

తెలంగాణ కాంగ్రెస్ లో చీఫ్ పోస్ట్ కోసం రేస్ జరుగుతోంది. కాంగ్రెస్‌లో నాకు పదవి కావాలని అడిగే వాళ్ల కంటే… తమకు ఇష్టం లేని వాళ్లకి ఇవ్వొద్దని చెప్పే వాళ్లే ఎక్కువ. ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే విచిత్రం.. ఈ జాబితాలోకి టీవీ9 కూడా చేరింది. అసలు కాంగ్రెస్‌కి టీవీ9కి సంబంధం ఏముంది..?. ఏమీ లేదు కానీ.. టీ పీసీసీ చీఫ్ పదవి ఎవరికి ఇచ్చినా పర్వాలేదు.. చివరికి పొన్నం ప్రభాకర్ కి ఇచ్చినా పర్వాలేదు కానీ.. రేవంత్ రెడ్డికి మాత్రం ఇవ్వకూడదన్నట్లుగా కథనాలు వండి వార్చేస్తోంది. మధు యాష్కీ నుంచి పొన్నం ప్రభాకర్ వరకూ.. అందరూ ఎంత బలమైన నేతలో చెబుతూ.. గ్రాఫిక్స్ చూపిస్తోంది. అదే సమయంలో… రేవంత్ రెడ్డికి ఇస్తే.. పార్టీలో తిరుగుబాటు వస్తుందని అందరూ గుడ్ బై చెబుతారని చెబుతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది… అదే రేవంత్ రెడ్డి పేరునే ప్రస్తావించకపోవడం.

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలు రేవంత్ రెడ్డి అనే నేత ఉన్నాడని.. ఆయన పీసీసీ రేసులో ఉన్నాడని టీవీ9 చెప్పడం లేదు. రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేసి.. కోమటిరెడ్డి దగ్గర్నుంచి లిస్ట్ ప్రారంభిస్తోంది. ఆ తర్వాత ఎవరికి పీసీసీ ఇస్తే.. అందరూ గుడ్ బై చెబుతారో… వారి లక్షణాలను వెల్లడిస్తోంది. సుదీర్ఘ కాలం పార్టీలో ఉండటం.. కేసుల్లేకపోవడం.. లాంటి పాయింట్లన్నింటినీ టీవీ9 వల్లే వేస్తోంది. రేవంత్ పేరు ఎత్తకుండా… ఇతర నేతల్ని ఎలివేట్ చేయడానికి … రేవంత్ పీఠం దక్కదని చెప్పడానికి టీవీ9 పడుతున్న తాపత్రయం మాత్రం.. కాంగ్రెస్ నేతల్ని కూడా ముచ్చటపడేలా చేస్తోంది.

ఇంతకీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయితే.. టీవీ9కి వచ్చే నష్టమేంటి…? అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కదా అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి సింగిల్ టార్గెట్‌గా టీవీ9.. యాజమాన్యం మారినప్పటి నుంచి పెట్టుకుంది. ఆయనపై సీరియల్‌గా గంటల కొద్దీ కథనాలు నడిపించింది. భూకబ్జాలు అని హడావుడి చేసింది. ఆయన ఇంట్లో సోదాలు చేస్తే.. అంతర్జాతీయ మాఫియా అన్నట్లుగా ఫేక్ డాక్యుమెంట్లు చూపించి ప్రసారం చేసింది. చివరికి వాటిపై రేవంత్ లీగల్ నోటీసులు పంపిస్తే సైలెంట్ అయింది. రేవంత్ పీసీసీ చీఫ్ అయితే.. కాంగ్రెస్‌కు ఊపొస్తే.. టీవీ9కి ఏమైనా కష్టం వస్తుందో.. టీవీ9 కొత్త యాజమాన్యానికి ఏమైనా ఇబ్బంది వస్తుందో అన్నట్లుగా ప్రస్తుతం ఆ టీవీ చానల్ కథనాలు నడుస్తున్నాయి. టీవీ9 అవస్థలు చూసి.. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు రా బాబూ అని సాటి జర్నలిస్టులు నవ్వుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీం చెప్పినా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్న వెంకట్రామిరెడ్డి..!

ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి .. ఎస్ఈసీ నిమ్మగడ్డను చంపే హక్కు కూడా ఉందన్నట్లుగా మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తన మాటలు వక్రీకరించారని చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి మరింత వివాదాస్పదమైన...

వ్యాక్సినేషన్ ఉన్నా గుజరాత్‌లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..!

పంచాయతీ ఎన్నికల అంశం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠకు కారణం అవుతోంది. వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో బలంగా వాదించాలని నిర్ణయించుకుంది. ఎన్నికలు జరపాలని అనుకుంటే వ్యాక్సినేషన్...

అప్పట్నుంచి గడ్డం తీసుకోని ఎల్వీ సుబ్రహ్మణ్యం..!

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం హఠాత్తుగా గుంటూరులో కనిపించారు. రామ మందిరానికి విరాళాలు సేకరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గబుక్కున ఆయనను చూసిన వారు చాలా మంది పోల్చుకోలేకపోయారు. ఎవరో స్వామిజీ ప్యాంట్,...

నిమ్మగడ్డ కింకర్తవ్యం..!?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ స్ట్రిక్ట్ ఐఏఎస్ అధికారిగా పని చేసుకుంటూ పోతున్నారు. ఓ రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా తనకు ఉన్న అధికారాలను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సర్వీస్ రూల్స్...

HOT NEWS

[X] Close
[X] Close