టీవీ 9 జగన్ రెడ్డికి ఎలా సపోర్టు చేయాలా అని.. తెగ క్రియేటివిటీ చూపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో ప్రతిపక్ష పార్టీలపై విషం చిమ్మి చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై వ్యక్తిగత దాడి కూడా చేసిన టీవీ9 ఇప్పుడు ఆ పని చేయలేకపోతోంది కానీ.. జగన్ రెడ్డికి మాత్రం మద్దతిచ్చేందుకు.. తప్పుడు మార్గాల్లో కూటమిపై విష ప్రచారం చేసేందుకు ఏ చిన్నసందు వచ్చినా వదిలి పెట్టడం లేదు.
టీవీ9లో ఇప్పటికీ అధికార పార్టీ కన్నా .. వైసీపీకే ఎక్కువ స్పేస్ ఉంటుంది. వైసీపీలో ఏ అడ్డగోలు లీడర్ .. అడ్డగోలు మాటాలు మాట్లాడినా బ్రేకింగులు వస్తాయి. ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా అదో పెద్ద సంచలనం అన్నట్లుగా ప్రసారం చేయడమే కాదు.. వారు వీర లెవల్లో పోరాడుతున్నారని కథనాలు కూడా రాస్తున్నారు. అదే కూటమి నేతల దగ్గరకు వచ్చేసరికి .. నియోజకవర్గాల్లో ఆ పార్టీల నేతలు కొట్లాడుకుంటున్నారని .. సమస్వయం లేదని.. పుకార్లు పుట్టించి కథనాలు ప్రసారం చేస్తున్నారు.
ఇక జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే.. టీవీ9కి పూనకం రాకుండా ఆగడం లేదు. ఆయన మాట్లాడిన మాటల్లో తమకు తెలిసిన నిజాలు ఉన్నా.. చెప్పకుండా.. పదేపదే జగన్ రెడ్డి చెప్పిన ఫేకుల్ని ప్రసారం చేస్తూనే ఉంటుంది. అమరావతిపై జగన్ రెడ్డి మాట్లాడిన మాటలకు గతంలో ఆయన మాట్లాడిన మాటలకు పొంతన ఉండదు..కానీ అదేదో ఆయన విధానం గొప్పగా ఉందన్నట్లుగా ప్రచారం చేస్తారు.
టీవీ9…. టీడీపీ, జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించిందో.. జగన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తుందో.. ఎలాంటి న్యూసులు, స్టోరీలు రాస్తుందో విశ్లేషిస్తే ఆ చానల్ ముసుగులో గుద్దులాట ఏంటో అర్థమైపోతుంది.