తమిళనాడులో రోడ్ షోల ద్వారా తన పార్టీకి క్రేజ్ తీసుకు రావాలని చేసిన ప్రయత్నాలు తొక్కిసలాట ఘటనతో వికటిచడంతో విజయ్ డైలమాలో పడిపోయారు. మరోసారి అలాంటి ఘటన తన రోడ్ షోలో జరిగితే విజయ్ పై తీవ్ర విమర్శలు వస్తాయి. అందుకే ఆయన రోడ్ షోల ద్వారా ప్రచారం ఆనే కాన్సెప్ట్‌ను పక్కన పెట్టేశారని..దీనికి బదులుగా జయలలిత స్ట్రాటజీని అమలు చేయాలనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.
జయలలిత రోడ్ షోలకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. విశాలమైన స్థలంలో జన సమీకరణ చేసి.. నేరుగా హెలికాఫ్టర్ ద్వారా ఆ ప్రాంతానికి చేరుకుంటారు. ప్రసంగిస్తారు. దీని ద్వారా వాహనంతో పాటు పరుగులు పెట్టడం.. తొక్కిసలాట జరగడం అనేది జరగలేదు. ఇదే పద్దతిని పాటించాలని విజయ్ కూడా నిర్ణయించుకున్నారు. నగరం వెలుపల ప్రైవేట్ ల్యాండ్‌ను లీజ్‌పై తీసుకుని.. అక్కడ జన సమీకరణ చేసి సభలు నిర్వహిస్తారు. ఇప్పటికే హెలికాఫ్టర్ ను విజయ్ బుక్ చేసుకున్నారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.
కరూర్ ఘటన తర్వాత విజయ్ ఇప్పటి వరకూ ప్రజల్లోకి వెళ్లలేదు. ఆయన గతంలో కరూర్ తొక్కిసలాట ఘటన మృతుల కుటుంబాలను పరామర్శిస్తారని ప్రచారం జరిగినా వాయిదా పడింది. 27వ తేదీన ఆయన కరూర్ వెళ్లి హోటల్లో అందర్నీ పరామర్శిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ త్వరలోనే క్యాంపెయిన్ ట్రైల్‌కు తిరిగి వస్తాడని, కానీ ఈసారి ‘సేఫ్’ , ‘కంట్రోల్డ్’ పద్దతిలో ప్రచారం జరుగుతుందంని చెబుతున్నారు.