మొదటిసారి ఆ కిక్కే వేరబ్బా…

రవితేజ మొదటిసారి జనాలకి బాగానే ‘కిక్’ ఇచ్చాడు కానీ రెండో సారి మాత్రం జనాలే ఆయన సినిమాకి కిక్ ఇచ్చినట్లు కనబడుతోంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన కిక్-2 ప్రేక్షకులను అక్కట్టుకోవడంలో విఫలమయింది. దానికి కారణం ఆయన మొదట ఇచ్చిన కిక్కేనని చెప్పకతప్పదు. ఆయన అదే కిక్కు కంటిన్యూ చేస్తారని జనాలు ఆశపడితే తప్పేమీ కాదు. కానీ వాళ్ళకి కావలసినంత కిక్ లేకపోవడంతో కిక్క్ తమకే కాస్త ఎక్కువయిందేమోననే అనుమానంతో ఆ సినిమాను మళ్ళీ చూసి దానిలో సెకండ్ హాఫ్ లో ఓ 20 నిమిషాల రీలు కత్తిరించి పక్కన పడేశారు. ఇప్పుడు స్క్రీన్ ప్లే టైట్ చేశాము కనుక ప్రేక్షకులకి కూడా కావలసినంత కిక్ ఎక్కుతుంది అని దర్శకుడు సురేందర్ రెడ్డి. అయినా కిక్క్ సరిపోకపోవడంతో ఏదో అలా సాగిపోతోంది అంతే. ‘ఈ కిక్క్ ఇవ్వని సినిమా కోసం అనవసరంగా బడ్జెట్ పెంచేశాడు’ సురేందర్ అంటూ దీనిని నిర్మించిన కళ్యాణ్ రామ్ వాపోతున్నట్లు సినీ పరిశ్రమలో టాక్. దానితో ఇద్దరు ఎడాపెడ మొహాలు వేసుకొని తిరుగుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అది గిట్టనివాళ్ళు చెప్పుకొనే టాక్ అంతే! అని సురేందర్ అంటున్నాడు. సురేందర్ రెడ్డి తీసిన రేసుగుర్రం విదేశాలలో దూసుకుపోయింది కానీ దీనికి ఎంతగా కిక్ కొట్టినా ఇంకా స్టార్ట్ అవ్వడం లేదని గిట్టనివాళ్ళ టాక్!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : పంజరంలో సీబీఐని న్యాయవ్యవస్థ విడిపించగలదా ?

పంజరంలో చిలుకలా వ్యవహరించవద్దని సీబీఐని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు....

రేవంత్‌ను తక్కువ అంచనా వేస్తే ఇంతే !

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు సార్లు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు, మూడు చోట్ల గెలవడానికి తంటాలు పడింది. ...

వైసీపీ ట్రబుల్ షూటర్ విడదల రజనీ

ప్రతి పార్టీకి ఓ ట్రబుల్ షూటర్ ఉంటారు. పార్టీలో పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఆ ట్రబుల్ షూటర్ చేసే ప్రయత్నాలు పార్టీని చాలా వరకూ గాడిలో పెడతాయి. వైసీపీలో ఇప్పుడా ట్రబుల్...

అధ్యక్ష పదవి కావాలా…బిగ్ టాస్క్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్!

తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి కోసం సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎంపీలు ఈటల, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్ తోపాటు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావులు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close