బండ్ల గణేష్ వర్సెస్ విజయసాయి.. ట్విట్టర్ రచ్చ రచ్చ !

విజయసాయిరెడ్డి – బండ్ల గణేష్ మధ్య ఏం జరిగిందో కానీ ఇద్దరూ ట్విట్టర్‌లో చెలరేగిపోతున్నారు. మొదట బండ్ల గణేష్ విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. మామూలుగా అయితే విజయసాయిరెడ్డి తన స్థాయిని చూసుకుని స్పందించకుండా వదిలేసేవారు. బయట ఎంపీ అయినా ట్విట్టర్‌లో మాత్రం విజయసాయిరెడ్డి స్థాయి అచ్చమైన వైసీపీ కార్యకర్తే కాబట్టి తనదైన శైలిలో బండ్ల గణేష్‌కు రిప్లయ్ ఇచ్చారు. పక్కలు.. వక్కలు అంటూ తన ట్రేడ్ మార్క్ లాంగ్వేజ్‌తో విమర్శలు గుప్పించడంతో ఇక బండ్ల గణేష్ ఊరుకుంటారా. ఆయన కూడా ప్రారంభించారు. విజయసాయిరెడ్డిని ఆయన భాషలోనే విమర్శించడం ప్రారంభించారు.

విజయసాయిరెడ్డి, బండ్ల గణేష్ మధ్య ప్రారంభమైన ఈ ట్విట్టర్ రచ్చ అలా సాయంత్రం వరకూ సాగుతూనే ఉంది. ఓ ట్వీట్ బండ్ల గణేష్ చేస్తే.. దానికి సమాధానంగా విజయసాయిరెడ్డి చేస్తారు. దానికి మళ్లీ గణేష్ కౌంటర్ ఇస్తారు ఇలా వరుసగా ఇద్దరి ట్విట్టర్ అకౌంట్లలో పెద్ద ఎత్తున ట్వీట్లు ఉన్నాయి. అయితే విజయసాయిరెడ్డి ఎక్కువ బ్యాడ్ అయిపోతున్నారు. బండ్ల గణేష్‌తో వాదన పెట్టుకోవడం ఏమిటని..ఆయనతో అన్నన్ని మాటల పడాల్సిన అవసరం ఏమిటని వైసీపీ నేతలు కూడా గింజుకుంటున్నారు.

ప్రతీ దానికి చంద్రబాబును తీసుకొచ్చే విజయసాయిరెడ్డి ఇందులోనూ అసువుగా చంద్రబాబు పేరు వాడేశారు. బండ్ల గణేష్‌ బాస్ చంద్రబాబు అనేశారు. దీంతో బండ్ల గణేష్ మరోసారి విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డిని దారుణంగా తిట్టారు. తన బాస్ పవన్ కల్యాణ్ అన్నారు. వీరి ట్విట్టర్ యుద్ధం వైరల్ కావడంతో… టీవీ చానళ్లు కూడా అందుకుంటున్నాయి. టీవీ5 మూర్తి ఏకంగా ప్రైమ్ టైమ్‌లోనే చర్చ పెట్టేశారు. బండ్ల గణేష్‌ను పిలిచారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం మరింత హైలెట్ కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !

ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య...

మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్న కేసీఆర్ !

మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్...

డిజిట‌ల్‌లో ‘శివ‌’

ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ - బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది....

రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌

చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close