త‌గ్గొద్దంటున్న బ‌న్నీ – 11నే రెండు సినిమాలు?

స‌రిలేరు నీకెవ్వ‌రు – అల వైకుంఠ‌పుర‌ములో సినిమాల మ‌ధ్య పోటీ రోజు రోజుకీ తీవ్ర‌త‌రం అవుతోంది. రెండు సినిమాల‌కూ ఇప్ప‌టి వ‌ర‌కూ రిలీజ్ డేట్ విష‌యంలో క్లారిటీ రాలేదు. `అల వైకుంఠ‌పుర‌ములో` 10నే వ‌స్తుంద‌న్న లీకులు బ‌య‌ట‌కు వ‌దిలి – మ‌హేష్‌టీమ్ ని కాస్త ఇర‌కాటంలో పడేయ‌డంలో బ‌న్నీ టీమ్ స‌క్సెస్ అయ్యింది. కాక‌పోతే 10న రావ‌డానికి బ‌న్నీ కూడా స‌సేమీరా అంటున్నాడు. అలాగ‌ని ముందు చెప్పిన‌ట్టు 12నా రావ‌డానికి వీల్లేదంటున్నాడు. బ‌న్నీ గురి 11 మీదే ఉంది. అంటే `స‌రిలేరు నీకెవ్వ‌రు` విడుద‌ల తేదీనే త‌న `అల వైకుంఠ‌పుర‌ములో`నూ విడుద‌ల చేయాల‌ని బ‌న్నీ ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు టాక్‌. అలా చేస్తే మ‌రోసారి రెండు పెద్ద సినిమా మ‌ధ్య క్లాష్ మొద‌లైపోతుంది.

ఇదంతా తొలి రోజు వ‌సూళ్ల రికార్డు గురించే అన్న‌ది నిర్వివాద అంశం. మ‌హేష్ సినిమా ముందు విడుద‌లైతే తొలిరోజు రికార్డు విష‌యంలో వాళ్ల‌కే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే.. వీలైన‌న్ని ఎక్కువ థియేట‌ర్లు వాళ్ల‌కే దొరుకుతాయి. 12న విడుద‌లైన బ‌న్నీ సినిమా థియేట‌ర్ల‌ని పంచుకోవాల్సివ‌స్తుంది. దాంతో ఫ‌స్ట్ డే రికార్డు కొట్టే ఛాన్సుండ‌దు. సినిమా బాగున్నా, బాగోలేక‌పోయినా తొలి మూడు రోజుల వ‌సూళ్లే కీల‌కం. అందునా ఫ‌స్ట్ డే వ‌సూళ్లే ఆ సినిమా భ‌విష్య‌త్తుని తేల్చేస్తాయి. 12న వస్తే ఆ ఆడ్వాంటేజ్ బ‌న్నీ సినిమాకి ఉండ‌దు. అందుకే మ‌హేష్‌కి పోటీగా 11నే సినిమా వ‌ద‌లాల‌ని భావిస్తున్నాడు. ఒక‌వేళ బ‌న్నీ సినిమా 11న అని ప్ర‌క‌టిస్తే, వెంట‌నే 10వ తేదీన మ‌హేష్ సినిమాని రంగంలోకి దించేసే ఛాన్సుంది. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కూ పోస్ట‌రు మీద విడుద‌ల తేదీ ఏదీ వేయ‌కుండా మ‌హేష్‌ టీమ్ జాగ్ర‌త్త ప‌డుతోంది. ఈరోజు సాయింత్రానిక‌ల్లా రిలీజ్ డేట్ విష‌యంలో ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ట్యాపింగ్ – దొరికినవాడే దొంగ !

"టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చాక మన ప్రతి కదలికపై మరొకరు నిఘా పెట్టడానికి అవకాశం ఇచ్చినట్లే. తప్పించుకునే అవకాశం లేదు.." కాకపోతే ఈ అవకాశం అధికారం ఉన్న వారికే వస్తుంది....

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close