ఏపిలో రెండు వైకాపా వికెట్లు డౌన్?

తెలంగాణాలో తెదేపా నేతలు, ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లిపోతుంటే, ఆంధ్రాలో కాంగ్రెస్, వైకాపాల నుండి తెదేపాలోకి వస్తున్నారు. అందుకు వారు చెప్పే కారణం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం లేదా సదరు ముఖ్యమంత్రులు రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషిలో బాగస్వాములు అవడం లేదా రేవంత్ రెడ్డి చెప్పిన వేరే ఇతర కారణాలు కావచ్చును. కానీ అసలు కారణం మాత్రం ఆ రెండు పార్టీలు అధికారంలో ఉండటమే. నీరు పల్లమెరుగు అన్నట్లు లేదా బెల్లం చుట్టూ ఈగలు ముసురుతున్నట్లు అధికారం ఉన్న చోటికే రాజకీయ నేతలందరూ చేరుకొంటుంటారు. కానీ ఏనుగుకి పైకి కనబడే దంతాలు. నోట్లో తినే దంతాలు వేరేగా ఉన్నట్లే రాజకీయ నాయకులు కూడా పార్టీలు మారడానికి ఏవేవో ‘ఇష్టోరీలు’ చెపుతుంటారు.

ఇక విషయంలోకి వస్తే ప్రకాశం జిల్లాకి చెందిన ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు గోడ దూకేయడానికి సిద్దంగా ఉన్నాట్లు తాజా సమాచార, వారిలో ఒకరు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కాగా మరొకరు కందుకూరు ఎమ్మెల్యే పి.రామారావు. ఇద్దరూ తెదేపాలో చేరడానికి సంసిద్దత వ్యక్తం చేయగా చంద్రబాబు నాయుడు కూడా ఒకే చెప్పేసినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కానీ స్థానిక తెదేపా నేతల నుండి అభ్యంతరాలు వస్తునందున ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అద్దంకిలో కరణం బలరామ్, కందుకూరులో దివి శివరామ్ నుండి అభ్యంతరాలు చెపుతున్నారు. ఇంకా కడపలో వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా సిద్దంగా ఉన్నప్పటికీ ఆయనకీ అదే సమస్య ఎదురవడంతో గత రెండు నెలల నుండి లైన్ క్లియర్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే వైకాపాను దొంగల పార్టీ అని, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి ని ఆ దొంగల ముఠాకి నాయకుడని తెదేపా నేతలు తరచూ విమర్శిస్తున్నప్పుడు మళ్ళీ ఆ దొంగల ముఠా నుండే ఎమ్మెల్యేలను పార్టీలో ఎందుకు చేర్చుకొంటున్నట్లో…వైకాపాలో ఉన్నప్పుడు నేరస్తులుగా కనిపించిన వారందరూ తెదేపాలో చేరిపోగానే నిష్కళంకమైన నేతలుగా మారిపోతారనుకోవాలేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“దిశ” బిల్లు ఏపీ ప్రభుత్వం దగ్గరే ఉందట..!

దిశ చట్టాన్ని కేంద్రంతో ఆమోదింప చేసుకోవడం అనే మిషన్‌ను ఎంపీలకు సీఎం జగన్ ఇచ్చారు. వారు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు జగన్‌తో జరిగిన భేటీలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తానించి.....

కృనాల్‌కు కరోనా… శ్రీలంకతో రెండో టీ ట్వంటీ వాయిదా..!

కాసేపట్లో ప్రారంభం కావాల్సిన శ్రీలంక-ఇండియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం పాజిటివ్ గా రావడంతో ...

జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ దొర‌క‌డం లేదా?

టికెట్ రేట్ల గొడ‌వ ఇంకా తేల‌లేదు. ఈలోగానే రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిమ్మ‌రుసు, ఇష్క్ చిత్రాలు ఈనెల 30న విడుద‌ల అవుతున్నాయి. లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌ల అవుతున్న తొలి చిత్రాలివి....

మీడియా వాచ్ : టీవీ9 యాంకర్లపై కేసులు..!

టీవీ9 యాంకర్లు రోడ్డున పడ్డారు. కేసులు పెట్టుకున్నారు. దీంతో టీవీ9 యజమాన్యం కూడా ఉలిక్కిపడింది. వారి గొడవ పూర్తిగా వ్యక్తిగతమని చానల్‌కు.. వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సి...

HOT NEWS

[X] Close
[X] Close