శ్రీమంతుడికి యు/ఏ సర్టిఫికేట్

మహేష్ బాబు, శృతి హాస్సన్ జంటగా నటించిన శ్రీమంతుడు చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. రవిశంకర్, సీవి మోహన్ మరియు నవీన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7వ తేదీన విడుదల కాబోతోంది. కొరటాల శివ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి రామజోగయ్య శాస్త్రి పాటలు సమకూర్చగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సంపత్ రాజ్, నదియ, ఆమని, పూర్ణ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com