పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు, రౌడీలు వస్తున్నారు. పిఠాపురం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయం చూసి పిఠాపురం ప్రజలు హడలి పోతున్నారు. వంగా గీత కేవలం అభ్యర్థి మాత్రమే. ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు రాజకీయం అంతా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి .. నలభై మంది స్మగ్లర్లను పెట్టుకుని చేస్తున్నారు.

ఎర్రచందనం స్మగ్లర్లే కాదు అన్ని రకాల అరాచక శక్తులతో అంటకాగే పెద్దిరెడ్డి ఫ్యామిలీ పుంగనూరు టైపులో పిఠాపురాన్ని మార్చాలనుకుంటున్నారు. డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతామని .. డబ్బులతో ఎవరినైనా ఓడిస్తామని విర్రవీగుతున్నారు. తండ్రి పెద్దిరెడ్డి .. చంద్రబాబు, బాలకృష్ణలను ఓడిస్తానంటూ వందలకోట్లు కుప్పం, హిందూపురంలలో వెదజల్లపుతున్నారు. పిల్ల పెద్దిరెడ్డి పవన్ ను ఓడిస్తానంటూ అదే పని చేస్తున్నారు. పిఠాపురంలో ప్రతి ఒక్క వైసీపీ నేతకు రూ.. రెండు నుంచి ఐదు లక్షలు పంపిణీ చేశారు.

పిఠాపురం మొత్తాన్ని స్మగ్లింగ్ మద్యంతో ముంచెత్తారు. ఓటర్లకు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. కనీసం నలభై యాభై చోట్ల మద్యం డంపులు పెట్టి .. ప్రచారంలో పాల్గొన్న వాళ్లకు పంపిణీ చేస్తున్నారు. అదంతా నాన్ పెయిడ్ గోవా మద్యం. అసలు రాష్ట్రంలోకి ఎలా వచ్చిందో .. సెబ్అధికారులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. రాష్ట్రం మొత్తం నకిలీ మద్యంతో ఉరకలెత్తుతోంది. పిఠాపురంలో ఇంకా ఎక్కువ. అయితే ఇది అతిగా మారడంతో పిఠాపురం ప్రజల తమ ఆత్మగౌరవంపై చేస్తున్నదాడిగా భావించే పరిస్థితి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆఫ్రికాకు పెద్దిరెడ్డి జంప్ – చెప్పకనే చెప్పారుగా !?

మంత్రి పెద్దిరెడ్డి ఆఫ్రికాలో కాంట్రాక్టులు చేస్తున్నారట.. అందుకని ఇక్కడి తన వాహనాలన్నింటినీ ముంబై పోర్టు నుంచి ఆఫ్రికాకు ఎక్స్ పోర్టు చేసేస్తున్నారు. ఆఫ్రికాలో మైనింగ్ చేయాలనుకుంటే... ఇక్కడి నుంచే ఎందుకు...

జగన్ కు విధించబోయే మొదటి శిక్ష ఇదేనా..?

ఏపీలో కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోన్న వేళ మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శాసన సభాపతి చైర్ లో ఎవరిని కూర్చోబెట్టనున్నారు..? అనే దానిపై బిగ్ డిస్కషన్ కొనసాగుతోంది....

రూట్ మార్చిన అధికారులు – ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామం

ఏపీ రాజకీయాల్లోనే కాదు అధికార వర్గాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే సంకేతాలతో టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లేందుకు చాలామంది అధికారులు ప్రయత్నాలు చేస్తుండటం...

మంచు మ‌నోజ్‌… మోస్ట్ డేంజ‌రెస్

మంచు మ‌నోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ‌మైంది. త‌ను వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో వెరైటీగా విల‌న్ పాత్ర‌ల‌పై మోజు పెంచుకొన్నాడు. త‌న‌కు అలాంటి అవ‌కాశాలు ఇప్పుడు బాగా వస్తున్నాయి. 'మిరాయ్‌'లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close