హీరోగారి వింత డిమాండ్లు.. నిర్మాత‌ల‌కు చుక్క‌లు

అమాంతం స్టార్ డ‌మ్ వ‌చ్చేసిన‌వాళ్లు ఎగిరెగిరి ప‌డ్డారంటే ఓ అర్థం ఉంది. ఒక్కో అడుగూ వేస్తూ, డ‌క్కా ముక్కీలు తింటూ, మెల్ల‌మెల్ల‌గా స్థిర‌ప‌డిన వాళ్లు ఒదిగే ఉంటారు. ఎందుకంటే స‌డ‌న్ గా కింద ప‌డితే, ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది వాళ్ల‌కే బాగా తెలుసు. అయితే ఓ హీరో విష‌యంలో ఈ సీన్ రివ‌ర్స్ అయ్యింది. చిన్న చిన్న వేషాలు వేస్తూ, మెల్ల‌మెల్ల‌గా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారి, ఆ త‌ర‌వాత హీరో ఫ్రెండ్ స్థాయికి చేరి, ఓ శుభ‌ముహూర్తాన హీరో అయిపోయి, ఒక‌ట్రెండు హిట్లు సంపాదించుకొన్నాడాయ‌న‌. ఇప్పుడు ప‌రిస్థితి బాగుంది. చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. ఓ స్టార్ హీరోయిన్ సినిమాలో ఆయ‌నే హీరో. ఓ బ‌డా హీరో సినిమాలో ఇప్పుడు కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మ‌రో రెండు మూడేళ్ల పాటు కెరీర్‌కి ఎలాంటి ఢోకా లేదు. అలాంటి ఆ హీరో ఇప్పుడు నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. ముఖ్యంగా హీరోయిన్ల విష‌యంలో.

ఈమ‌ధ్య ఓ అగ్ర హీరోయిన్ తో జోడీ కట్టాడు. ఆ సినిమా త్వ‌ర‌లో విడుదల కానుంది. ఇప్పుడు ఆ సినిమా చూపిస్తూ.. ‘నాకు స్టార్ డ‌మ్ ఉన్న హీరోయిన్లే కావాలి’ అని ష‌ర‌తు పెడుతున్నాడు. త‌న‌కు కాస్త క్లోజ్ గా ఉన్న హీరోయిన్ల‌ని సినిమాల్లో తీసుకోవాల‌ని నిర్మాత‌ల‌పై ఒత్తిడి పెంచుతున్నాడ‌ని తెలుస్తోంది. పైగా ప్ర‌మోష‌న్లు భారీగా చేయాల‌ని, ప్ర‌మోష‌న్ల బ‌డ్జెట్ కూడా తానే వేసి ఇస్తున్నాడ‌ని, ప‌బ్లిసిటీకి ఆ స్థాయిలో ఖ‌ర్చు పెట్ట‌క‌పోతే, తాను ప్ర‌మోషన్ల‌కు రాన‌ని నిక్క‌చ్చిగా చెప్పేస్తున్నాడ‌ట‌. దాంతో నిర్మాత‌లు త‌ల‌లు ప‌ట్టుకొంటున్నారు. ‘ఈ హీరోని ఎర‌క్క‌పోయిన తీసుకొన్నాం…’ అని ఫీల‌వుతున్నార్ట‌. ఓ సినిమా తీశాక‌.. దాని స్థాయిని, మార్కెట్ ని బ‌ట్టి ప్ర‌మోష‌న్లు చేసుకుంటారు. హీరో ప‌క్క‌న ఎవ‌రైతే బాగుంటార‌న్న విష‌యంలో ద‌ర్శ‌కుడికి ఓ అభిరుచి ఉంటుంది. అవ‌న్నీ ప‌క్క‌న పెట్టేసి, నా మాటే నెగ్గాల‌ని ప‌ట్టుప‌ట్టుకొని కూర్చోవ‌డం ఏమాత్రం హ‌ర్ష‌ణీయం కాదు. ఓ వైపు హీరోల పారితోషికాలు త‌గ్గించుకోవాల‌ని, నిర్మాత‌ల్ని బ‌తికించాల‌ని పోరాటం చేస్తుంటే మ‌రోవైపు ఇలా గొంతెమ్మ కోర్కెలు కోరుతూ నిర్మాత‌ల్ని ఇబ్బంది పెట్టే హీరోలు త‌యార‌వ్వ‌డం దారుణ‌మైన విష‌య‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుహాస్‌కి ఇంత డిమాండా..?

చిన్న చిన్న సినిమాల్లో, చిన్న చిన్న పాత్ర‌ల‌తో ఎదిగాడు సుహాస్‌. యూ ట్యూబ్ నుంచి.. వెండి తెర‌కి ప్ర‌మోష‌న్ తెచ్చుకొన్నాడు. హీరో అయ్యాడు. క‌ల‌ర్ ఫొటోతో త‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ...

తమ్మినేని సీతారాం LLB వివాదం !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాను పదవి చేపట్టిన తరవాత న్యాయపరిజ్ఞానం ఉండాలనుకుంటున్నారేమో కానీ ఎల్ఎల్‌బీ చదవాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఓ లా కాలేజీలో చేరారు. మూడేళ్లు దాటిపోయింది. కానీ ఆయన...

“లీక్‌” రాజకీయం – బీఆర్ఎస్‌ రాంగ్ స్టెప్ ?

టీఎస్‌పీఎస్సీ లీక్ వ్యవహారాన్ని రాజకీయ రంగు పులమడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు విషయాల కన్నా కొసరు విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు సిట్ కేసులు పెట్టించే ప్రయత్నం...

బీజేపీ పెద్దల నుంచి కోమటిరెడ్డి కోరుతున్న హామీ ఏంటి !?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే బీజేపీ అగ్రనేతల్ని కలుస్తున్నారు. గడ్కరీ, అమిత్ షా, మోదీలను మార్చి మార్చి కలుస్తున్నారు. ఏమిటంటే తన నియోజకవర్గం పనుల కోసమని చెబుతున్నారు. ఏ బీజేపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close