ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య వార్ సాగుతుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవాలని, లేదంటే ఇష్యూ మరింత సీరియస్ అవుతుందని హెచ్చరించారు.
ఇరాన్ తో అణు ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించి విఫలం అయ్యారు. అమెరికాతో అణు ఒప్పందానికి ఇరాన్ నిరాకరించడంతో బెదిరింపులకు ఇప్పుడు దిగుతున్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు ఆగిపోవాలంటే ఏం చేయాలో ట్రంప్ చెప్పడంతో.. ఇజ్రాయెల్ వెనక అమెరికా హస్తం ఉందనే విషయం అర్థం అవుతోంది.
ఇరాన్ పై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ ను మట్టుబెట్టింది. దీంతో ఇరాన్ కూడా తాజాగా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ పై 100డ్రోన్లను ప్రయోగించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్దమేఘాలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ స్పందించారు.
అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ ను హెచ్చరించారు. ఇందుకు అంగీకరించకపోతే ఇజ్రాయెల్ నుంచి మరిన్ని ఊహించని విధంగా దాడులు ఉంటాయన్నారు.