అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ యూనివర్శిటీల ఊపిరి తీస్తున్నారు. విద్యార్థి వీసా ఇంటర్యూలను నిలిపివేశారు. అన్ని రకాల విద్యార్థి వీసా ఇంటర్యూలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. కొన్ని కఠినమైన నిబంధనలు తెచ్చిన తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకూ విద్యార్థులు అమెరికాకు వెళ్లి చదువుకోవాలని.. అక్కడి యూనివర్శిటీల్లో చేరాలనుకునేవారు ఎదురు చూడక తప్పదు.
అమెరికాకు చదువు కోసం వచ్చే వారి వ్యవహారం ట్రంప్ అన్ని పరిశీలించాలని నిర్ణయించారు. చివరికి వారి సోషల్ మీడియా అకౌంట్లు కూడా పరిశీలించి.. ఎలాంటి చిన్న వ్యతిరేక అంశం ఉన్నా రిజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ట్రంప్ మనస్థత్వం, తీసుకుంటున్న నిర్ణయాల ప్రకారం చూస్తే.. అక్కడి యూనివర్శిటీల్లో ప్రవేశాలు పొందినవారికి సగం మందికి వీసా రాదు. మిగిలిన సగం మంది ఇన్ని ఆంక్షల మధ్య అక్కడికిపోయి చేసేదేముందని సైలెంటుగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
భారతీయ విద్యార్థులు అమెరికాకు పెద్ద ఆదాయ వనరు. ఫీజుల రూపంలో దాదాపుగా ఏటా లక్షకోట్లను చెల్లిస్తారన్న నివేదికలు ఉన్నాయి. ఇక భారతీయ విద్యార్థులు అక్కడి ఆర్థిక వ్యవస్థకూ తమదైన కంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వాటన్నింటికీ మీద ట్రంప్ బండ వేస్తున్నారు. అమెరికా వెళ్లాలనుకునేవారి సంఖ్య తగ్గుతూండగా… ఇప్పుడు ట్రంప్ ఇలాంటి పిచ్చి నిర్ణయాలతో . మరింత ఎక్కువగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.