పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈనెల 19న విడుదల అవుతోంది. ఇప్పుడు టీజర్ వదిలారు. 45 సెకన్ల నిడివి ఉన్న టీజర్ ఇది. ట్రైలర్‌కి ముందు ప్రోమోలా అనిపించింది. పవన్ కల్యాణ్ ని కౌబోయ్ లుక్ లో చూడడం అభిమానులకు నచ్చుతుంది.
భగవద్గీత లోని శ్లోకంతో టీజర్ మొదలైంది. ‘ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భరత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ వదిలారు పవన్ కల్యాణ్. ఈనెల 16న ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజున ట్రైలర్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలోంచి మరో రెండు పాటలు బయటకు రావాలి. వాటిని 16 లోగా ఒకొక్కటిగా విడుదల చేస్తారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పాటలు అందించారు. తమన్ నేపథ్య సంగీతం సమకూర్చారు. టీజర్ కి కూడా తమన్ ఆర్.ఆర్ ఇచ్చారు. కమర్షియల్ ప్యాకేజ్‌గా ఈ సినిమాని మలిచారు హరీష్. పవన్ అభిమానులకు కావాల్సిన మసాలా అంతా ఈ సినిమాలో పొందు పరిచారు. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది.
