పెద్ద సినిమాలు వాయిదా పడుతున్న వేళ.. ‘ఉస్తాద్’ ఓవారం ముందుకు రావడం కచ్చితంగా మంచి వ్యూహాత్మక నిర్ణయం. ఎందుకంటే ‘టాక్సిక్’ వాయిదా పడింది. ‘దురంధర్ 2’ వచ్చినా ఆ ఎఫెక్ట్ సౌత్ పై అంతగా ఉండదు. తెలుగులో అస్సలు ఉండదు. కాబట్టి.. కావాల్సినంత స్పేస్ దొరికినట్టైంది. 19న వస్తే.. ఏప్రిల్ రెండో వారం వరకూ ఉస్తాద్ కు ఎదురు ఉండదు. మార్చి చివరి వారంలో ఎలాగూ సినిమాలు లేవు. లాంగ్ రన్ కి కావాల్సినంత ఛాన్స్ వుంది. కాకపోతే పాజిటీవ్ టాక్ చాలా అవసరం. పవన్ సినిమాకు ‘యావరేజ్’ టాక్ వచ్చినా సరిపోతుంది. బాక్సాఫీసుని ఏలేయొచ్చు. అదే హిట్ టాక్ వస్తే, ఆపడం చాలా కష్టం. ‘ఓజీ’కి వచ్చినట్టు యునానిమస్ టాక్ వస్తే పవ్ నుంచి మరో బ్లాక్ బస్టర్ చూడొచ్చు.
19న రిలీజ్ అయితే ఉగాది, రంజాన్ సెలవలు కూడా కలిసొస్తాయి. లాంగ్ రన్ ఉంది. అందుకే కాస్త కష్టమైనా 19న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొంది టీమ్. ఈలోగా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు పాటలు బయటకు రావాల్సివుంది. ట్రైలర్ వదలాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలి. పవన్ కల్యాణ్ ఈనెలంతా బిజీగా ఉంటారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ తరవాత జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. రెండు రోజులు డబ్బింగ్ కోసం కేటాయించాలి. సో.. ఇవన్నీ ప్రతికూల అంశాలు. వీటిని టీమ్ ఎలా దాటుకొని వస్తుందన్నది చూడాలి. పవన్ కల్యాణ్ లాంటి స్టార్ సినిమాలకు ప్రచారం లేకపోయినా ఫర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి.. వీలైనంత ప్రమోషన్ చేసుకొంటూ వెళ్లాల్సిందే. పవన్ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చే అవకాశం లేదు. హరీష్ ఇప్పటికే రౌండ్ టేబుల్ అంటూ ఇంటర్వ్యూలు ఇచ్చి, ఈ సినిమాకు సంబంధించి జనం మాట్లాడుకొనేలా చేశాడు. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ గట్టిగా చేయాలి. ఒకట్రెండు రోజుల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎక్కడన్న విషయంలో ఓ క్లారిటీ రావొచ్చు.
